వైఎస్‌ఆర్‌సీపీలో టీడీపీ నేతల చేరిక
కొత్తకోట (రావికమతం): మండలానికి చెందిన పలువురు తెలుగుదేశం నాయకులు ఆదివారం విశాఖలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించారు. కొత్తకోట మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ కేదారి శెట్టి గున్నాజీరావు, అతని సోదరుడు అచ్చిరాజుతోపాటు వెల్లంకి సత్తిబాబు, పలువురు దేశం పార్టీ నాయకులు, మహిళలు భీమరాతి లక్ష్మి, గుమ్ముడు మణి, కోట లక్ష్మి, దండి సత్యవతి, గొంప లక్ష్మి, తాటికొండ సత్యవతి, వేమవరపు అమ్మాజీ, శరకాన జానకి, 40 మంది వరకు కార్యకర్తలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరారు.
కొత్తకోట నుంచి ఒక బస్సు, ఆరు కార్లలో ర్యాలీగా వెళ్లారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమరనాథ్, నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ వారిని పరిచయం చేశారు. ర్యాలీగా వెళ్లిన వారిలో పార్టీ మండల అధ్యక్షుడు పతివాడ చిన్నంనాయుడు, గుమ్ముడు సత్యదేవ, పందల దేవ, శీలం శంకర్రావు, పెనుగొండ తదితరులున్నారు.