మొక్కను నాటి నీళ్లు పోస్తున్న రైల్వే చీఫ్ మెడికల్ డైరెక్టర్ దొర
ఉధృతంగా స్వచ్ఛ రైల్వే
Published Sat, Sep 17 2016 11:54 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM
– మొక్కలు నాటడమే కాదు..పరిరక్షణకూ చర్యలు
– దక్షిణ మధ్య రైల్వే జోన్ చీఫ్ మెడికల్ డైరెక్టర్
తిరుపతి అర్బన్: రైల్వే శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ రైల్వే కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ మెడికల్ డైరెక్టర్ కేహెచ్‌కే దొర వెల్లడించారు. అక్టోబర్ 2 నుంచి వారం రోజుల పాటు నిర్వహించనున్న స్వచ్ఛ రైల్వే ప్రచార వారోత్సవాల్లో భాగంగా శనివారం తిరుపతి రైల్వే స్టేషన్ ఆవరణలో సీనియర్ లైజన్ ఆఫీసర్ కుప్పాల సత్యనారాయణతో కలసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం దొర విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ శాఖాధికారులు మొక్కలు నాటడం చేస్తుంటారని, వాటి సంరక్షణకు సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కుప్పాల సత్యనారాయణ మాట్లాడుతూ రైల్వే పరిధిలోని వ్యాపార సంస్థల నిర్వాహకులు, కాంట్రాక్టర్లు కూడా స్వచ్ఛ రైల్వేలో భాగస్వాములై తిరుపతి స్టేషన్‌ను ఆదర్శంగా నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్(ఎస్‌ఎంఆర్) సుభోద్‌మిత్ర, రైల్వే హెల్త్ ఆఫీసర్ వేణుగోపాల్, ఐపీఎఫ్ నాగార్జున రావు, చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ సురేంద్రనాయక్, చీఫ్ టీటీఐలు టీవీ రావు, రాజాబాబు, మోహన్‌రెడ్డి, రైల్వే ఐఎన్‌టీయూసీ జిల్లా కార్యదర్శి దోసపాటి చైతన్య శర్మ, ఐఆర్‌సీటీసీ ఏరియా మేనేజర్ మధుసూదనరావు, ఎస్‌ఎంఆర్ కార్యాలయ అధికారి రాజు పాల్గొన్నారు.
Advertisement
Advertisement