అనంతపురం అర్బన్: జిల్లాలో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. తొమ్మిది కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించారు. పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాలను కలెక్టర్ కోన శశిధర్ తనిఖీ చేశారు. పరీక్షకు మొత్తం 3,537 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్–1 పరీక్షకి 2,099 మంది, పేపర్–2 పరీక్షకి 2,106 మం ది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన పేపర్–1 పరీక్షకు 1,438 మంది (40. 65 శాతం), మధ్యాహ్నం జరిగిన పేపర్–2 పరీక్షకు 1,431 మం ది (40.45 శాతం) మాత్రమే హాజరయ్యారు.
ఎస్‌ఎస్‌బీఎన్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశా రు.అదే విధంగా దివ్యాంగులు, అంధులు పరీక్ష రాస్తున్న కేంద్రా న్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సివి ల్స్ ప్రిలిమినరీ పరీక్ష జిల్లాలో జరగడం ఇది రెండవసారి అన్నా రు. ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా, యూపీఎస్సీ నిబంధనల మేరకు పరీక్షలను నిర్వహించామన్నారు. అనంతరం యూ పీఎస్సీ పరీక్ష పరిశీలకురాలిగా వచ్చిన సర్వే, భూ రికార్డుల శాఖ కమిషనర్ వాణిమోహన్‌కు పరీక్షల నిర్వహణ వివరాలను తెలి యజేశారు. కలెక్టర్ వెంట ఆర్‌డీఓ మలోలా, ఎస్‌ఎస్‌బీఎన్ కేం ద్రం పరిశీలకులు సురేశ్, జిల్లా పరిశీలకులు హౌసింగ్ పీడీ ప్రసా ద్, యువజన సంక్షేమ శాఖాధికారి గీతాగాంధీవాణి ఉన్నారు.
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతం
Published Sun, Aug 7 2016 11:52 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
Advertisement
Advertisement