కలెక్టర్‌ను అభినందించిన సీఎం
Published Sat, Jul 23 2016 4:09 PM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : పోలవరం కుడి కాలువ నిర్మాణ పనులు, పట్టిసీమ ఎత్తిపోతల పథకం అమలులో విశేష కృషి చేసిన కలెక్టర్ కాటంనేని భాస్కర్ కృషి ప్రశంసనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడ నుంచి శుక్రవారం ఉదయం కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి కృష్ణా పుష్కరాలు, పోలవరం కుడి, ఎడమ కాలువల నిర్మాణ తీరు, తదితర అంశాలపై సమీక్షించారు. ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏడాదిలోగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించిందని ఏడాదిలో ఈ ప్రాజెక్టు చేయలేమని భావించామని కలెక్టర్ సహకారంతో పూర్తి చేశామన్నారు.
Advertisement
Advertisement