ఆలస్యం చేస్తే పరిశ్రమలు ఎలా స్థాపిస్తాం | if delay how to establish industreies | Sakshi
Sakshi News home page

ఆలస్యం చేస్తే పరిశ్రమలు ఎలా స్థాపిస్తాం

Published Wed, Jul 27 2016 9:05 PM | Last Updated on Mon, Feb 17 2020 5:11 PM

ఆలస్యం చేస్తే పరిశ్రమలు ఎలా స్థాపిస్తాం - Sakshi

ఆలస్యం చేస్తే పరిశ్రమలు ఎలా స్థాపిస్తాం

ఏలూరు : జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి వారిచే పరిశ్రమలు పెట్టించాలని ఎంతో కృషి చేస్తోందని కానీ పర్యావరణంకు సంబంధించి అనుమతులు ఆలస్యం చేయడం వల్ల త్వరితగతిన పరిశ్రమలు నెలకొల్పలేకున్నామని కలెక్టర్‌ అన్నారు. స్థానిక కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జిల్లా పారిశ్రామిక  మండలి సమావేశానికి కలెక్టర్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల అనుమతుల కోసం ధరఖాస్తుదారులు ఎదురు చూస్తుంటే వారి ధరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేయాల్సిన శాఖాధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారనీ, ఇలా ఉంటే పరిశ్రమల కోసం ఎవరు ముందుకు వస్తారని కలెక్టర్‌ ప్రశ్నించారు. పరిశ్రమల అనుమతుల కోసం సంబంధితాధికారులు శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
గత వారం నుండి ఈ వారం వరకూ ఎన్ని ధరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయో పరిశీలించి ధరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న శాఖల వారీగా అధికారులతో కలెక్టర్‌ మాట్లాడి తక్షణమే ఆయా ధరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్‌ భాస్కర్‌ ఆయా శాఖాధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ఉపసంచాలకులు ఆదిశేషు,  ఏసుదాసు, డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ మోహనరావు, సోషల్‌వెల్ఫేర్‌ డిడి రంగలక్ష్మీదేవి, డిటిసి కోటయ్య, ఇపిడిసిఎల్‌ ఎడి రవికుమార్‌ పాల్గొన్నారు.  
పరిపాలనామోదం వచ్చినా పూర్తికావా ః
నాబార్డు నిధుల ద్వారా ఆర్‌ఐడిఎఫ్‌ఐ పనులు 2013–14 సంవత్సరాల్లో అంగన్‌వాడీ భవనాలకు పరిపాలనామోదం వచ్చినా ఇప్పటి వరకూ ఎందుకు పూర్తి కాలేదని జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ పంచాయతీ రాజ్‌ ఎస్‌ఇ మాణిక్యాన్ని ప్రశ్నించారు. నాబార్డు నిధులు వినియోగంపై కలెక్టరేట్‌లో ఆర్‌ఐడిఎఫ్‌ పనుల ప్రగతిపై కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీ భవనాలు కొన్ని పునాది స్థాయిలో, కొన్ని రూఫ్‌ స్థాయిలో ఎందుకు నిలిచిపోయాయని నిలదీశారు. దీనిపై స్పందించిన పంచాయతీరాజ్‌ ఎస్‌ఇ ఇచ్చిన నిధులు సరిపోలేదని చెప్పగా ఇప్పటి వరకూ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఆగస్టు నెలాఖరునాటికి అంగన్‌వాడీ భవనాలన్నీ పూర్తి చేయాలని చెప్పారు. అదే విధంగా పశుసంవర్ధకశాఖ ద్వారా కేటాయించిన నిధులతో గోపాలమిత్ర భవనాలను కూడా పూర్తి చేయాలని కలెక్టరు ఆదేశించారు. పనులు చేయని కాంట్రాక్టర్లను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ భాస్కర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ నిర్మల, పశుసంవర్ధక శాఖ జెడి జ్ఞానేశ్వర్, వైఎస్‌ఆర్‌ యూనివర్శిటీ అసిస్టెంట్‌ ఇంజనీరు నగేష్‌ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. 
ఆన్‌లైన్‌లో పొందుపరచరా.. ?
జిల్లాలో ఖరీఫ్‌ పంట కాలంలో 2వేల 700 కోట్ల రూపాయలు పంట రుణాలు అందిచినట్లు బ్యాంకర్లు చెబుతున్నారే తప్ప రైతు వారీ రుణాలు పంపిణీ వివరాలు ఎందుకు ఆన్‌లైన్‌లో పొందు పరచడం లేదని జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ను ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ప్రాథమిక రంగాల అభివద్ధి కార్యక్రమాలపై వ్యవసాయ, అనుబంధ అధికారులతో కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో ఏ బ్యాంకు నుండి ఎంత మంది రైతులకు రుణాలు అందించారో వాటి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందు పరచడానికి బ్యాంకర్లకు కష్టం ఏంటని ప్రశ్నించారు. జిల్లాలో రైతులకు అందించిన రుణాల వివరాలను రాష్ట్రస్థాయి బ్యాంకు అధికారులు కమిటీ నుండి పొందటమేమిటనీ, జిల్లాలో ఏ రైతుకు ఏమేరకు పంట రుణాలు ఇచ్చారో వాటి వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపరచాలని లీడ్‌బ్యాంకు మేనేజరును ఆదేశించారు. జిల్లాలో అవసరం మేరకు చేప పిల్లల పెంపకాన్ని చేపట్టేందుకు మత్స్యశాఖాధికారులు చర్యలు తీసుకోవాలనీ, కొత్త రకం చేపల సీడ్‌ పెంపపకానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లాలో పశువులకు అవసరమైన పోషకాలతో కూడిన గడ్డిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ప్రయివేటు ఎరువుల డీలర్లు కూడా ఈ పోస్‌ యంత్రాల ద్వారానే ఎరువులు, పురుగుల మందులను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టరు వ్యవసాయాధికారులను ఆదేశించారు. జిల్లాలోని రైతులందరికీ భూసార పరీక్ష కార్డులను రెండు రోజుల్లోగా అందించాలని కలెక్టరు భాస్కర్‌ వ్యవసాయశాఖాధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సిపిఒ సత్యనారాయణ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. 
 
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement