
'మహిళల రక్షణ వదిలి విలాసాలా'
చిత్తూరు: ఎన్నికలకు ముందు మహిళల రక్షణ కోసం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. అంగన్ వాడి ఉద్యోగులు వేతనాలు పెంచి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చకపోగా.. వారి ఉద్యోగాలు కూడా తొలగిస్తున్నారని చెప్పారు.
బాలికల సంరక్షణ పథకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని, తన స్నేహితుని కుమార్తె జరీనా బేగం చావు బతుకుల మధ్య ఉన్నా పట్టించుకోవడం లేదని రోజా ఆరోపించారు. గోదావరిలో 27మందిని చంపి, రిషితేశ్వరి మరణానికి కారకులైనవారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే విదేశాలకు విలాసాలకోసం వెళ్లాడని ఆరోపించారు.