ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోనే గడిపారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి ఫాంహౌస్‌కు వెళ్లిన విషయం తెల్సిందే.
జగదేవ్‌పూర్ (మెదక్) : ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మెదక్ జిల్లాలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోనే గడిపారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి ఫాంహౌస్‌కు వెళ్లిన విషయం తెల్సిందే. శనివారం సాయంత్రం వ్యవసాయ క్షేత్రంలో పర్యటించిన ఆయన ఫాంహౌస్‌లో జరుగుతున్న పనులను పరిశీలించారు.
జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రత్యేక అధికారి ప్రవీణ్‌రావు ఫాంహౌస్‌లో సీఎంను కలిసినట్లు సమాచారం. దత్తత గ్రామాల్లో విత్తోనోత్పత్తిపై పూర్తి వివరాలను సీఎంకు వివరించినట్లు తెలిసింది. అలాగే వివిధ అభివృద్ధి పనుల తీరును కూడా అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. సోమవారం వరకు ముఖ్యమంత్రి ఫాంహౌస్‌లోనే ఉంటారని సమాచారం.