క్వాయిన్ టెన్‌షన్
క్వాయిన్ టెన్‌షన్
Published Sun, Apr 2 2017 1:28 AM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM
తణుకు అర్బన్/తణుకు : పెద్ద నోట్ల రద్దు వ్యవహారం చిల్లర కొరత సమస్య సృష్టించి మార్కెట్‌ను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిల్లర కొరత తీర్చేందుకు అధిక సంఖ్యలో విడుదలైన పది రూపాయల నాణాల మారకం మార్కెట్‌లో ఇప్పుడు సమస్యాత్మకంగా మారింది. నకిలీ నాణాలు చలామణి అవుతున్నాయని, బ్యాంకుల్లో రూ.10 నాణాలను తీసుకోవడంలేదనే ఉద్దేశంతో కొందరు వ్యాపారులు వీటిని నిరాకరిస్తున్నారు. ఏకంగా పది రూపాయలు నాణాలు తీసుకోమంటూ బోర్డులు కూడా పెడుతున్నారు. దీంతో మరలా చిల్లర సమస్య తప్పదని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చిన్న, పెద్ద దుకాణదారులు పది రూపాయిల నాణాలను భారీగానే సమకూర్చుకున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఉన్న నాణాలను బయటకు పంపించలేకపోతున్నామని, కొత్త నాణాలు ఎలా తీసుకుంటామని కొందరు అంటున్నారు. నకిలీ నాణాలు పెద్ద సంఖ్యలో చలామణి అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. కొన్ని నాణాలను నకిలీవి గా బ్యాంకు అధికారులు ధ్రువీకరించారని అంటున్నారు. దీంతో పది రూపాయల నాణాల మారకం సమస్యగా మారడంతోపాటు చిల్లర కొరత కూడా ఎక్కువవుతుందని తెలుస్తోంది.
Advertisement
Advertisement