
రైల్వేలైన్ కు త్వరలో భూసేకరణ
రైల్వేలైన్ల ఏర్పాటు పనులు పూర్తి చేసేందుకు త్వరలోనే రైల్వే అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు.
రైల్వే ప్రాజెక్టుల ఉన్నతాధికారితో త్వరలోనే జిల్లాలో పలు రైల్వే ప్రాజెక్టులపై జాయింట్ తనిఖీలు నిర్వహిస్తామని, రైల్వే శాఖ గతంలో మాదిరిగా నత్తనడకతో రైల్వే ట్రాక్‌లు నిర్మించాలనే ఆలోచనలకు స్వస్తి పలకాలన్నారు. ఆరు నెలల్లో రైల్వే ట్రాక్ పూర్తి చేసి కాంట్రాక్టర్‌కు బోనస్ ఇచ్చే స్థాయిలో పనులు జరగాలని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. ఆకివీడు–భీమవరం, నరసాపురం–కోటిపలి్లలతో పాటు ఏలూరు సమీపంలోని వట్లూరు వద్ద కూడా రైల్వే బ్రిడ్జి పనులు కూడా వెంటనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం నిర్మించే ఇళ్ల కాలనీలన్నీ ఏడాదిలోగా పూర్తి చేయాలన్నారు.
అన్ని కాలనీల్లో మౌలిక వసతులు కల్పించి దశల వారీగా ఏడాదిలోపు 30 కాలనీలు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ భానుప్రసాద్, ఏజేసీ షరీఫ్, డీఆర్వో కె.హైమావతి, ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీనివాస్, పోలవరం ప్రాజెక్టు ఎస్‌ఈ శ్రీనివాసయాదవ్, గృహనిర్మాణశాఖ పీడీ ఇ.శ్రీనివాస్, సబ్‌కలెక్టర్లు షాన్ మోహన్, గాంధీ, ఆర్డీవోలు చక్రధర్, శ్రీనివాసరావు, లవన్న పాల్గొన్నారు.