కలెక్టరేట్‌ ముట్టడి | Collectorate siege | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ముట్టడి

Published Wed, Aug 24 2016 9:55 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM

కలెక్టరేట్‌ ముట్టడి - Sakshi

కలెక్టరేట్‌ ముట్టడి

నల్లగొండ టూటౌన్‌ : హాస్టల్‌ విద్యార్థుల మెస్, కాస్మొటిక్‌ చార్జీలను పెంచాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. అంతకుముందు స్థానిక గడియారం సెంటర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు కలెక్టరేట్‌లో చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అనంతరం కార్యాలయ ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇందూరు సాగర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎర్ర అఖిల్, ఎస్‌.భిక్షం, జిల్లా ఉపాధ్యక్షుడు బీవీ.చారి, సహాయ కార్యదర్శి బి.లింగయ్య, కోశాధికారి ఎం.చందర్‌రావు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement