కామెడీతోనే సగటు ప్రేక్షకుడికి రిలీఫ్‌ | comedian sumansetti interview | Sakshi
Sakshi News home page

కామెడీతోనే సగటు ప్రేక్షకుడికి రిలీఫ్‌

Published Tue, Jul 4 2017 2:18 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

కామెడీతోనే సగటు ప్రేక్షకుడికి రిలీఫ్‌ - Sakshi

కామెడీతోనే సగటు ప్రేక్షకుడికి రిలీఫ్‌

ప్రముఖ కామెడీ ఆర్టిస్ట్‌ సుమన్‌ శెట్టి
సగటు ప్రేక్షకుడు సినిమాల్లో కామెడీతోనే రిలీఫ్‌ అవుతాడని ప్రముఖ కామెడీ ఆర్టిస్ట్‌ పాశర్ల సుమన్‌ శెట్టి అన్నారు. ద్రాక్షారామలోని భీమేశ్వర దంత వైద్యశాల ఏడో వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఉచిత దంత వైద్య శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విశేషాలివీ..      

సాక్షి : సినిమాల్లోకి ఎలా వచ్చారు?
సుమన్‌ శెట్టి : అప్పట్లో చిత్రం సినిమా మాగజైన్‌లో కొత్త నటీనటులు కావాలని చూసి తేజ గారికి నా ఫోటోలు పంపాను. హైదరాబాద్‌ ఆడిషన్స్‌కి రమ్మని టెలిగ్రామ్‌ ఇచ్చారు. అక్కడ ఆడిషన్స్‌లో నన్ను సెలక్ట్‌ చేశారు.

సాక్షి : మీకు బాగా పేరు తెచ్చిన సినిమా?
సుమన్‌ శెట్టి: మొదటి సినిమా జయంలోనే మంచి పేరు వచ్చింది. ఈ సినిమాకు నంది అవార్డు కూడా వచ్చింది. అలాగే 7/జీ బృందావనం కాలనీ సినిమాకు తమిళంలో నంది అవార్డు(తమిళంలో వెరైటీ అవార్డుగా పిలుస్తారు) వచ్చింది. యజ్ఞం, రణం, నిజం తదితర సినిమాల్లో మంచి పేరు వచ్చింది. ఇప్పటి వరకు సుమారు 380 సినిమాలు చేశాను. ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో నిర్మిస్తున్న ప్రేమభిక్ష, హర్రర్‌ మూవీ 12ఓ క్లాక్‌ సినిమాలు చేస్తున్నాను.

సాక్షి: మీరు ఇష్టపడే సినిమాలు?
సుమన్‌ శెట్టి: కచ్చితంగా కామెడీ సినిమాలే. ఎందుకంటే సగటు ప్రేక్షకుడు రిలీఫ్‌ కోసం సినిమాకు వస్తాడు.  

సాక్షి: కామెడీ చిత్రాల ఉరవడి తగ్గింది కదా?
సుమన్‌ శెట్టి : కొంతకాలంగా హర్రర్‌ సినిమాల ట్రెండ్‌ నడుస్తోంది. ఎప్పడు ఏ ట్రెండ్‌ నడిచినా కామెడీకి తగిన ప్రాధాన్యం ఉంటుంది. దీనికి ఉదాహరణ ఇప్పటి హర్రర్‌ సినిమాలే. వాటితో భయపెట్టాలని కాకుండా నవ్వించాలని చూస్తున్నారు.

సాక్షి : కొత్తగా సినిమాల్లోకి వచ్చేవారికి మీరిచ్చే సలహా?
సుమన్‌ శెట్టి : తప్పకుండా కొత్తతరం రావాలి. ప్రతిభ ఉన్నవారికి వెండితెర, బుల్లితెరలు ఎప్పుడూ స్వాగతం పలుకుతాయి.

సాక్షి: మీకు ఇష్టమైన నటులు?
సుమన్‌ శెట్టి : రాళ్లపల్లి, అల్లు రామలింగయ్య, రాజబా బు ఇలా పాతతరం హాస్యనటుల ప్రేరణ నా మీద ఎక్కువ.   

– రామచంద్రపురం రూరల్‌ (రామచంద్రపురం)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement