వామపక్ష నేతల అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి.
నెల్లూరు(క్రైమ్): ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో శనివారం తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ బస్టాండ్ వద్ద నాలుగో నగర ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో పోలీస్ బలగాలను మోహరించారు. బస్సుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ఆరు గంటల ప్రాంతంలో వామపక్ష నేతలు ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకొని రహదారిపై బైఠాయించారు. బస్సుల రాకపోకలకు అంతరాయం కలిగించడంతో పోలీసులు వామపక్ష నేతలను తొలగించేందుకు యత్నించగా వారు ప్రతిఘటించారు. సీపీఎం నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, అల్లాడి గోపాల్, అరిగెల రమమ్మ, సీపీఐ నాయకులు పార్థసారథి, అరిగెల నాగేంద్రసాయితో పాటు పలువురు వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి నాలుగో నగర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.