కమ్యూనిస్టుల జీవితం పేదలకే అంకితం | Communists life dedicated to the poor | Sakshi
Sakshi News home page

కమ్యూనిస్టుల జీవితం పేదలకే అంకితం

Published Mon, Mar 21 2016 2:47 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

కమ్యూనిస్టుల జీవితం పేదలకే అంకితం - Sakshi

కమ్యూనిస్టుల జీవితం పేదలకే అంకితం

సీపీఐ నేత నారాయణ

తిరుమలాయపాలెం: కమ్యూనిస్టుల యావజ్జీవితం పేదలకే అంకితమని సీపీఐ జాతీయ నేత డాక్టర్ కె. నారాయణ అన్నారు.  ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో ఆదివారం జరిగిన సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి రాయల సుభాష్‌చంద్రబోస్ సంతాప సభలో ఆయన మాట్లాడుతూ బోస్ ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు.

సీపీఎం రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ దోపిడీ వ్యవస్థ అంతానికి కమ్యూనిస్టులు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. న్యూడెమోక్రసీ నేతలు డీవీ కృష్ణ, గాదె దివాకర్,  రమాదేవి, సీపీఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు, ప్రజాకవి జయరాజు, రాయల చంద్రశేఖర్, సంభాని చంద్రశేఖర్, గుమ్మడి నర్సయ్య పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement