హన్మకొండలో కాంగ్రెస్, టీడీపీ నేతల జోక్యం
ఇద్దరి మధ్య వాగ్వాదం
సాక్షి, హన్మకొండ: దేవుళ్ల విగ్రహ ప్రతిష్ఠాపన విషయంలో చెలరేగిన వివాదం టీడీపీ, కాంగ్రెస్ నేతల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరుపార్టీలకు చెందిన నేతలు పరస్పర దూషణలకు దిగగా, అనుచరులు తోసుకున్నారు. చివరకు పోలీసులు ఇరువర్గాలకు సర్ధి చెప్పారు. ఈ ఘటనలో వరంగల్ జిల్లా డీ సీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ తుపాకీతో బెదిరించాడంటూ టీడీపీ అర్బన్ పార్టీ అధ్యక్షుడు అనిశెట్టి మురళీ ఆరోపించారు. నాయిని రాజేందర్‌రెడ్డి తుపాకీ లెసైన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తోపులాటలో తుపాకీ కింద పడబోతే పట్టుకున్నానని, బెదిరించలేదని నాయిని చెప్పారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 44వ డివిజన్ పరిధిలోని జాగృతినగర్, పోచమ్మకుంట కాలనీలకు మధ్య కార్పొరేషన్‌కు చెందిన ఖాళీ స్థలం ఉంది.
సమీప ప్రాం తాల ప్రజలు సామూహిక అవసరాలకు ఈ స్థలాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ స్థలంలో బతకమ్మలను నిమజ్జనం చేసేందుకు గొయ్యి తవ్వారు. ఈ క్రమంలో వినాయక విగ్రహం బయటపడిందంటూ అక్కడే విగ్రహాన్ని ప్రతిష్టించారు. పక్కనే ఉన్న పోచమ్మకుంటకు చెందిన విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు పోతులూరి వీరబ్రహ్మం విగ్రహన్ని ఈ స్థలంలోనే ప్రతిష్టించేందుకు పూనుకున్నారు. దీంతో రెండు కాలనీలకు చెందిన విశ్వబ్రాహ్మణ సం ఘ నాయకుల మధ్య వివాదం మొదలైంది.
అయితే, డీసీసీ అధ్యక్షుడు నాయినీ రాజేందర్‌రెడ్డి జాగృతి కాలనీకి గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రెండు వర్గాల వారు చర్చించుకొని సమస్య పరిష్కరించాలని నాయిని సూచించారు. ఈ క్రమంలో 44 డివిజన్ మాజీ కార్పొరేటర్, టీడీపీ అర్బన్ అధ్యక్షుడు అనిశెట్టి మురళి వచ్చి కమ్యూనిటీ హల్ నిర్మించాలనుకున్న స్థలంలో వినాయక విగ్రహం ప్రతిష్టిం చడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో నాయిని రాజేందర్‌రెడ్డి, అనిశెట్టి మురళిల మధ్య వాగ్వావాదం చోటుచేసుకుంది.
వారి అనుచరుల మధ్య తోపులాట జరుగుతున్న సమయంలో నాయిని తనవద్ద ఉన్న లెసైన్డ్ రివ్వాలర్‌ను బయటకు తీశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే నాయిని రివ్వాలర్‌ను దుస్తుల్లో పెట్టుకున్నారు. పోలీసులు వచ్చి ఇరువర్గాలను సర్దిచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. జాగృతి కాలనీలో సర్వేనంబరు 6/2001 లేఅవుట్ ప్లాట్ లో ఉన్న 350 గజాల స్దలంలో మహిళలు బతుకమ్మ ఆడుకోవడం మినహా ఎలాంటి కట్టడాలు, నిర్మాణాలు చేపట్టినా తొలగిస్తామన్నాని గ్రేటర్ వరంగల్ అధికారులు స్పష్టం చేశారు.
దేవుళ్ల కోసం పోటాపోటీ
Published Wed, Oct 14 2015 1:20 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement