- రీజినల్ కో ఆర్డినేటర్ మల్లారెడ్డి
ఎంసెట్ –3కి ఏర్పాట్లు పూర్తి
Published Thu, Sep 8 2016 12:59 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM
కేయూ క్యాంపస్ : తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 11న జరుగనున్న టీఎస్ ఎంసెట్ –3 నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎంసెట్ –3 రీజినల్ కోఆర్డినేటర్, కేయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి తెలిపారు. ఈ మేర కు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వరంగల్‌లో 4,710 మంది పరీక్ష రాయబోతున్నారని పేర్కొన్నారు. 11న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష ఉంటుందని తెలి పారు. హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కేయూ ఇంజనీరింగ్ కళాశాల, యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల, యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల, వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి డిగ్రీ కళాశాల, సీకేఎం ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాల, వరంగల్ ఎల్‌బీ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయని వివరించారు. పరీక్ష సమయానికి గంట ముందు నుంచే కేంద్రాల్లోకి పంపిస్తామని, నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు.
Advertisement