ప్రత్యేక హోదా కోసం తలపెట్టిన బంద్ రాయచోటి నియోజకవర్గంలో సంపూర్ణంగా జరిగింది. బంద్‌కు వ్యాపార, వాణిజ్య విద్యాసంస్థలు సహకరించి మూసివేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఇచ్చిన బంద్‌లో కాంగ్రెస్, సీపీం, సీపీఐ తదితర రాజకీయపార్టీలతోపాటు ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ లాంటి విద్యార్థి సంఘాలు బంద్‌లో పాలుపంచుకున్నాయి.
చిన్నమండెంలో బంద్‌ను పర్యవేక్షిస్తోన్న జిల్లాపరిషత్ మాజీ వైఎస్ చైర్మన్ దేవనాథ రెడ్డితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంబేపల్లిలో జాతీయ రహదారిపై డీసీఎంఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. లక్కిరెడ్డిపల్లిలో జెడ్‌పీటీసీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో వామపక్షాలు బంద్‌లో పాలుపంచుకుని వైఎస్సార్ సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. సుండుపల్లిలో జెడ్‌పీటీసీ హకీం ఆధ్వర్యంలో మానవహారం చేపట్టారు. బంద్ కారణంగా రోడ్లపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆర్‌టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.