ఇందిరాగాంధీ విగ్రహ దిమ్మెపై సీకే నాయుడు ప్రతిమ
ధర్నాకు దిగిన కాంగ్రెస్ నాయకులు
మచిలీపట్నం : స్థానిక పరాసుపేట సెంటరులో భారత క్రికెట్ తొలి కెప్టెన్ సి.కె.నాయుడు విగ్రహ ఏర్పాటు ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహం కోసం నిర్మించిన దిమ్మెపై టీడీపీ నాయకులు శనివారం నాయుడు విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీంతో రాత్రి వేళ కాంగ్రెస్ నాయకులు ధర్నాకు దిగారు. సి.కె.నాయుడు విగ్రహం స్థానం లో ఇంది రాగాంధీ విగ్రహాన్ని పునఃప్రతి ష్టించాలని డిమాండ్ చేశారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు డౌన్... డౌన్... భూములే కాదు, విగ్రహాల దిమ్మెలను కబ్జా చేస్తున్న టీడీపీ ప్రభుత్వం నశించాలి’ అటూ నినాదాలు చేశారు. ఒకానొక దశలో నాయుడు విగ్రహాన్ని తొలగించేందుకు యత్నించారు. చిలకలపూడి పోలీసులు వారిని నిలువరించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు విగ్రహం ఎదుట రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు.
ఇందిరాగాంధీ బొమ్మసెంటర్‌గా పేరు
పరాసుపేట ప్రధాన సెంటర్‌ను ఎన్నో ఏళ్లుగా ఇందిరాగాంధీ బొమ్మ సెంటర్‌గా పిలుస్తారు. ఇందిరాగాంధీ మరణానంతరం ఆమె విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. 2008లో రోడ్డు విస్తరణ కోసం మున్సిపాలిటీలో తీర్మానం చేసి విగ్రహాన్ని తొలగించారు. ఆ తరువాత విగ్రహం ఏర్పాటుకు మున్సిపాలిటీనే ఖర్చు భరిం చాలని నిర్ణరుుంచారు. మునిసిపల్ నిధులు రూ.2.75 లక్షలతో దిమ్మె నిర్మిం చారు. ఇందిరాగాంధీ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో వచ్చే అక్టోబర్ 19న ఇక్కడ ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథంలో టీడీపీ నాయకులు ఆ దిమ్మెపై సి.కె.నాయుడు విగ్రహాన్ని ప్రతిష్టిం చారు. ధర్నాలో కాంగ్రెస్ నేతలు బలగం విజయశేఖర్, అబ్దుల్ మతీన్, గుమ్మడి విద్యాసాగర్, దాదా సాహెబ్, రబ్బానీ, పెయ్యల మధుసూదనరావు, కొల్లు రమేష్, రామిశెట్టి ప్రసాద్, పెదశింగు వెంకటేశ్వరరావు, భోగిరెడ్డి వెంకటేశ్వర్లు, నల్లబోతు శామ్యూల్, నాగరాజు తదితరులు ఉన్నారు.