టీడీపీ-టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ
వరంగల్: జిల్లాలోని పాలకుర్తి మార్కెట్ యార్డు వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మార్కెట్ యార్డులోని ఓ భవనం శంకుస్థాపన విషయంలో టీడీపీ-టీఆర్ఎస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. టీడీపీ-టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరినొకరు దూషించుకుంటూ రాళ్ల దాడి చేసుకున్నారు.
ఈ ఘటనలో పాలపర్తి ఎస్ఐ సహా 15 మందికి గాయాలవ్వగా వారిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లిదయాకర్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.