– జేఎన్‌టీయూలో 103 మంది అడ్ హక్ లెక్చరర్ల నియామకం
జేఎన్‌టీయూ : జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్సెస్, కెమికల్ విభాగాల్లో శాశ్వత బోధన సిబ్బందితో పాటు అదనంగా 103 మంది అడ్‌హాక్ లెక్చరర్లు నియామకం చేశారు. ఈ నియామకాల్లో రూల్‌ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అనుభవం లేని వారిని నియమించడంతో నాణ్యమైన బోధనలభించదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎంటెక్ కోర్సుల్లోని విద్యార్థులకు ఎంటెక్ పూర్తీ అయిన వారిని అడ్‌హాక్ లెక్చరర్లుగా నియమించారు.
కానీ హ్యుమానిటీస్, సైన్సెస్ విభాగాల్లో అడ్‌హాక్ లెక్చరర్లుగా పనిచేయాలంటే నెట్ (జాతీయ అర్హత పరీక్ష)/ సెట్ (రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష)/ పీహెచ్‌డీ పూర్తి అయిన వారిని నియమించాల్సి ఉంది. కానీ కేవలం పీజీ పూర్తి అయిన వారిని నియమించారు. ఇక అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలల్లోని వసతుల పర్యవేక్షణ సంగతి చెప్పనక్కర్లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. జేఎన్‌టీయూ ఉన్నతాధికారులు రెండు సంవత్సరాల కాలంలో ఏ ఇంజినీరింగ్ కళాశాల్లోను తనిఖీ చేసిన దాఖలాలు లేవు. మొక్కుబడిగా నిజనిర్ధారణ కమిటీలు పర్యవేక్షించడం మినహా ఉన్నతాధికారులు వర్సిటీకే పరిమతం అయ్యారనే వాదన వినిపిస్తోంది.
పరిశీలిస్తాం..
ఎంటెక్ బ్రాంచులు పెరగడంతో అడ్‌హాక్ లెక్చరర్ల సంఖ్య పెరిగింది. సెలెక్షన్ కమిటీ సిఫార్సుల మేరకే నియామకాలు చేశాము.
–ఆచార్య ఎంఎల్‌ఎస్ దేవకుమార్, వైస్ ప్రిన్సిపాల్, జేఎన్‌టీయూ అనంతపురం.
నిబంధనలకు తిలోదకాలు
Published Thu, Sep 22 2016 11:50 PM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
Advertisement
Advertisement