ఉపాధ్యాయుల చేతిలోనే దేశభవిష్యత్తు | country future depends on teachers | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల చేతిలోనే దేశభవిష్యత్తు

Published Wed, Sep 7 2016 10:26 PM | Last Updated on Thu, Mar 21 2019 8:19 PM

ఉపాధ్యాయుల చేతిలోనే దేశభవిష్యత్తు - Sakshi

ఉపాధ్యాయుల చేతిలోనే దేశభవిష్యత్తు

కడప: దేశ భవిష్యత్తు రూపుదిద్దుకునేది పాఠశాలలోనేనని, అందుకు ఉపాధ్యాయులే కీలకపాత్ర పోషించాలని  జిల్లా కలెక్టర్‌ కేవీ సత్యనారాయణ పేర్కొన్నారు. కడప కొత్త కలెక్టరేట్‌ సభాభవన్‌లో బుధవారం సాయంత్రం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని కలెక్టర్‌ కేవీ సత్యనారాయణ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డిలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ సాధారణ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ రాష్ట్రపతి స్థాయికి ఎదిగి పదవికి వన్నె తెచ్చారని కొనియాడారు. ప్రస్తుత ఉపాధ్యాయులు కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు సామాజిక సృహ, శాస్త్రీయత గురించి నేర్పించాలన్నారు. ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైందని, దేశ భవిషత్తు ఉపాధ్యాయుల చేతిలోనే ఉందన్నారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. గత రెండేళ్లుగా విద్యాశాఖ ఉత్తమ ఫలితాలను సాధిస్తోందని, అదే ఫలితాలను ఈసారి కూడా కొనసాగించాలని కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మాట్లాడుతూ గురువులే సమాజానికి దిశానిర్దేశకులన్నారు. మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ సమాజంలో మార్పుకు ఉపాధ్యాయులే కీలకమన్నారు.

సర్వశిక్షా అభియాన్‌ ప్రాజెక్టు అధికారి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా విద్యపరంగా ముందంజలో ఉన్నామన్నారు. కేజీబీవీల్లో కూడా చక్కటి ఫలితాలతో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి ప్రత్యేక గుర్తింపు పొందామన్నారు. డీఈఓ బండ్లపల్లి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ సీసీఈపై ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి మెటీరియల్‌ సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో స్టెప్‌ సీఈఓ మమత, ఆర్‌ఐపీఈ భానుమూర్తిరాజు, డిప్యూటీ ఈఓలు ప్రసన్నాంజనేయులు, రంగారెడ్డి, శైలజ, జెడ్పీ డిప్యూటీ ఈఓ వి.నాగ మునిరెడ్డి, డీఈఓ కార్యాలయ ఏడీ జిలానీబాషా, డీసీఈబీ కార్యదర్శి నారాయణరెడ్డి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement