Best Teacher Awards
-
47 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: విద్యా బోధనలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందించనుంది. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం రవీంద్ర భారతిలో గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. గురువారం సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సహా పలువురు మంత్రులు, రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. ఉపాధ్యాయులు, లెక్చరర్లు, విశ్వవిద్యాలయ అధ్యాపకులు కలిపి మొత్తం 113 మందికి ప్రభుత్వం పురస్కారాలు ఇవ్వనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 12 మంది హెచ్ఎంలు, 23 మంది స్కూల్ అసిస్టెంట్లు, 12 మంది ఎస్జీటీలు, ఉన్నత విద్యలో పనిచేస్తున్న 55 మందిఅధ్యాపకులు, ఇంటర్ విద్యలో పనిచేస్తున్న 11 మంది లెక్చరర్లు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. పురస్కారాలకు ఎంపికైన వారు వీరే..ప్రధానోపాధ్యాయులు: టి భాస్కర్ (పాఠశాల/జిల్లా: తెల్లాపూర్, సంగారెడ్డి), మెస నరేందర్ (ఆలూరు, నిజామాబాద్), ఏవీ సత్యవతి–రిటైర్డ్ (నయాబజార్, హైదరాబాద్), ఎస్.కె. తాజ్‌బాబు (రాయదుర్గ్, రంగారెడ్డి), టి సునీత (కోటకొండ, నారాయణ్‌పేట్), బి. బాపూరెడ్డి (కుషాయిగూడ, మల్కాజ్గిరి), పి.శంకర్‌గౌడ్ (యాప్రాల, వనపర్తి), పి. పద్మజ (కసనగోడ, నల్లగొండ), కె.నర్సయ్య (అంకోలి, ఆదిలాబాద్), కె.ఇందుమతి(హసన్‌పర్తి, హనుమకొండ), డాక్టర్ ప్రభు దయాల్ (రామాపురం, కొత్తగూడెం), జి. రాజన్న (హనుమకొండ).స్కూల్ అసిస్టెంట్లు: కె. నర్సింహులు (ఇబ్రహీంనగర్, మహబూబ్‌నగర్), కొంక అనురాధ (కొత్తూరు, వరంగల్), కూన రమేశ్ (చిచోలి–బి, నిర్మల్), ముద్దుకృష్ణ (దుబ్బ, నిజామాబాద్), జె. రాజశేఖర్‌రావు (చిన్నముద్దునూర్, నాగర్‌కర్నూల్), ఎస్.సురేందర్ (అన్నారం, మంచిర్యాల), సీహెచ్ షర్మిల (అలుబాక, ములుగు), ఎం.రమేశ్ (బ్రాహ్మణపల్లి, పెద్దపల్లి), జి.రాజయ్య (మొగుళ్ళపల్లి, భూపాలపల్లి), జి.అంజన్‌కుమార్ (ఎనీ్టపీసీ జ్యోతినగర్, పెద్దపల్లి), కృష్ణకాంత్ నాయక్ (మిర్యాలగూడ, నల్లగొండ), సీహెచ్ గిరిప్రసాద్ (తిమ్మాపురం, సూర్యాపేట), ఎన్.అమరేందర్ రెడ్డి (కొంపల్లి, భూపాలపల్లి), పి.శంకర్‌గౌడ్ (శివనగర్, సిరిసిల్ల), జి.వెంకటేశ్వర్లు (పెద్దగోపతి, ఖమ్మం), కె.సత్యం(కందానెల్లి, వికారాబాద్), టి.స్వర్ణలత (పాల్వంచ, కామారెడ్డి), వి.రామకృష్ణ(చిన్నమల్లారెడ్డి, కామారెడ్డి), పి.రూపారాణి (సిరిసినగండ్ల, సిద్దిపేట), ఆర్.కృష్ణప్రసాద్ (నాగ్‌పూర్, మెదక్), హెచ్.విజయకుమార్ (ముడిమనిక్, సంగారెడ్డి), కె.కృష్ణయ్య(కుత్బుల్లాపూర్, రంగారెడ్డి). ఎస్జీటీలు: జె. శ్రీనివాస్ (అక్కపల్లిగూడ, మంచిర్యాల), వై.వెంకటసురేశ్ కుమార్ (రామంచ, సిద్దిపేట), పి.రఘురామరావు (జీడీపల్లి, నాగర్‌కర్నూల్), దాసరి శంకర్ (పీచర్ల, నిర్మల్), పల్సి శ్రీనివాస్ (భైంసా, నిర్మల్), కె సుధాకర్ (తిడుగు, జనగాం), డి.కవిత(పెద్ద రాజమూర్, మహబూబ్‌నగర్), ఎం. క్రాంతికుమార్ (సింగన్నగూడ, సిద్దిపేట), కె. నాగేశ్వరి (పటేల్‌గూడ, సంగారెడ్డి), దల్లి ఉమాదేవి (ఆర్ఎన్ గుట్ట, భద్రాద్రి కొత్తగూడెం), జి. శ్రీనివాస్ (కీసరగుట్ట, మల్కాజ్గిరి), ఎంఎ అలీమ్ (గద్వాల్, నిజామాబాద్) -
‘ఉత్తమ’ సిఫారసులు!
సాక్షి సిటీ బ్యూరో, రంగారెడ్డి జిల్లా: ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో పైరవీలకే ప్రాధాన్యం ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. బుధవారం రాత్రి పొద్దుపోయాక హైదరాబాద్ జిల్లాలో 60 మంది ఉత్తమ ఉపాధ్యాయుల జాబితా విడుదలైంది. రంగారెడ్డి జిల్లాలో 51 మందిని ఎంపిక చేశారు. అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు సమాచారం. హైదరాబాద్ జిల్లా విషయా నికొస్తే....గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి తీవ్ర ఆలస్యమైంది. అంతేకాదు ఉపాధ్యాయుల ఎంపికపై తుది జాబితా వెల్లడికి ముందే పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. కానీ జిల్లా విద్యాశాఖ ఇవేవీ పట్టించుకోకుండా పనితీరును కాకుండా పైరవీకారులకు, అనర్హులకు జాబితాలో చోటు కల్పించినట్టు తెలిసింది. ఒకే పాఠశాల నుంచి ఇద్దరు ముగ్గురు ఉపాధ్యాయులను ఎంపిక చేయడం, పనితీరును పరిగణనలోకి తీసుకోకుండా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సిఫార్సులకు పెద్దపీఠ వేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుడంతో విద్యాశాఖ అప్రమత్తమై దిద్దుబాటు చర్యలకు పూనుకున్నట్లు తెలిసింది. దీనిపై హైదరాబాద్ కలెక్టర్ మాణిక్‌రాజ్ ఆరా తీశారు. అసలు ఎంపిక విధానం ఎలా ఉంది ? ఏఏ నిబంధనలు పరిగణనలోకి తీసుకున్నారు? దరఖాస్తులు ఎన్ని వచ్చాయి? ఎలా ఎంపిక చేశారంటూ వివరాలు అడిగారు. దీంతో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో దిద్దుబాటు చర్యలకు పూనుకున్నట్టు సమాచారం. ఫలితంగా బుధవారం రాత్రి 60 పేర్లతో ఉత్తమ ఉపాధ్యాయుల జాబితా విడుదల చేశారు. రంగారెడ్డి జిల్లాలో... ఉత్తమ టీచర్లను ఎంపిక చేయాలని పాఠశాల విద్య డైరెక్టరేట్.. జిల్లా విద్యాశాఖను ఆదేశించింది. పది అంశాల ప్రామాణికంగా ఉత్తములుగా గుర్తించాలని సూచించింది. విద్యార్థుల నమోదులో అసాధారణ చొరవ, డ్రాప్ అవుట్లను నివారించడం, అనుభవం, పదో తరగతిలో వందశాతం విద్యార్థుల ఉత్తీర్ణత, ఆయా పోటీల్లో విద్యార్థులకు దక్కిన అవార్డుల్లో వారి పాత్ర, ఆవిష్కరణల అమలు, వందశాతం ఆధార్ సీడింగ్, బడుల్లో మౌలిక వసతుల కల్పనకు జరిపిన కృషి, హరితహారంలో ప్రగతి తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలని పేర్కొంది. ఉత్తముల ఎంపిక బాధ్యతను ఎంఈఓలకు అప్పగించింది. మండలంలోని స్కూళ్ల సంఖ్యను బట్టి ముగ్గురు నుంచి ఐదుగురు పేర్లను ఎంఈఓలు విద్యాశాఖకు ప్రతిపాదించారు. ఏయే అంశాల ఆధారంగా ప్రతిపాదించారో తెలిపే డాక్యుమెంట్లను అందజేశారు. జిల్లావ్యాప్తంగా 93 మంది పేర్లతో కూడిన జాబితా జిల్లా విద్యాశాఖకు గత నెలలో చేరింది. కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించిన ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ప్రతిపాదనలను పరిశీలించి 51 మంది టీచర్ల పేర్లను ఫైనల్ చేసింది. నిర్దేశిత ప్రామాణికాల పరంగా చూపిన చొరవ, కనబర్చిన ప్రతిభను బట్టి టీచర్లకు మార్కులు వేశారు. కేటగిరీ, సబ్జెక్ వారీగా ఎక్కువ మార్కులు పొందిన జాబితాలో ఉన్నత స్థాయిలో ఉన్న వారిని ఉత్తములుగా పరిగణించారు. ఈ జాబితాకు గతనెల 28న కలెక్టర్ ఆమోదం తెలిపారు. సంఘాల ఆరోపణలు ఇవీ.. అవార్డులు దక్కించుకోవడానికి ఆయా ఉపాధ్యాయ సంఘాల్లో పోటీ నెలకొంది. విద్యా శాఖ రూపొందించిన జాబితా తప్పుల తడకగా ఉందని, అనర్హులకు చోటు కల్పించారని పలు సంఘాల సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. దీనికితోడు తమ సంఘానికి చెందిన టీచర్లకు స్థానం కల్పించలేదని, ఫలానా సంఘం వాళ్లకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని వారి వాదన. వారి లాగే తమ సం ఘం సభ్యులకు అవార్డులు ఇవ్వాలని కొం దరు నేతలు జెడ్పీ చైర్‌పర్సన్‌ను కలిసినట్లు తెలిసింది. పది నుంచి 20 మంది టీచర్ల జాబితాలను చైర్‌పర్సన్‌కు అందజేసి వారికి అవార్డులు దక్కేలా చూడాలని కోరినట్లు సమాచారం. ఉత్తముల జాబితా పెంపు? కలెక్టర్ ఆమోదించిన 51 పేర్లు కాకుండా.. ఉత్తముల జాబితాలో మరికొందరి టీచర్ల పేర్లను చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధుల సిఫారసుతో ఇది సాధ్యపడే వీలుంది. గతంలో ఈ తరహా ఘటనలు చాలా జరగడం.. అందుకు బలాన్ని చేకూర్చుతోంది. గతేడాది విద్యాశాఖ 53 మంది టీచర్ల పేర్లను ఖరారు చేయగా.. ఉపాధ్యాయ సంఘాల పైరవీలు, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో తెల్లవారేలోగా ఈ జాబితా 90కు చేరుకోవడం గమనార్హం. అప్పటికప్పుడే జాబితా పెరగడంతో.. కొందరు టీచర్లకు సర్టిఫికెట్లు సరిపోలేదు. శాలువాలతో సన్మానించి సరిపుచ్చాల్సి వచ్చింది. అంతేగా సస్పెన్షన్ అయిన టీచర్‌కూ అవార్డు ప్రదానం చేయాలని ఓ సంఘం సభ్యులు విద్యాశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. మేడ్చల్ ఉత్తమఉపాధ్యాయులు వీరే...:నేడు కీసర లలితా ఫంక్షన్ హాలులో సన్మానం సాక్షి, మేడ్చల్‌జిల్లా: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు గురువారం కీసర మండల కేంద్రంలోని లలితా ఫంక్షన్ హాలులో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు డీఈఓ విజయకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. మండలాల వారీగా వీరే.. శామీర్‌పేట్ : గురుచారి, పి.రాజు, వై.మోహన్‌రాజ్, బి.సత్యనారాయణమూర్తి, ఎం.నర్సింగరావు, ఎస్.వెంకటరమణ, కె.సంగీత, ఆర్.వాణి 8 కుత్బుల్లాపూర్: ఏవీ సుబ్బారావు , వి.కరుణ, బి.ఆంజనేయులు ఘట్కేసర్: ఏ.శాంతకుమారి, బి.దేవయాని, ఎం.యమున కూకట్పల్లి: పి.నర్సింహులు, ఆర్.సంధ్యారాణి, బి.మీనా రాజకుమారి, ఇ.గాలయ్య ఉప్పల్: వై.సంపత్‌కుమార్, ఎన్.ప్రమీల, పి.మంజులాదేవి, జె.పాండురంగవిఠల్, డి.విజయశ్రీ, జె.సువర్ణ, కె.అరుణజ్యోతి, ఎం.విజయలక్ష్మి, ఎం.వేణుగోపాల్‌రెడ్డి అల్వాల్: జి.హన్మిరెడ్డి, జి.లక్ష్మయ్య, డాక్టరు రితిభాషిణి, జి.సుప్రియ, వి.భారతి, కాప్రా: బి.బ్రహ్మానందం, బి.గోపాల్, ఎం.శ్రీశైలంరెడ్డి, డి.భగవంత మేడ్చల్: చేపూరి సుజాత, జి.పుష్పలత, టి.రమాదేవి, ఎ.శ్రీనివాసులు, ఎస్.వెంకటరమణ; మల్కాజిగిరి: జీవీఆర్.రాజేశ్వరి, బి.విలియమ్స్, ఎం.నాగబాబు, వై.పెంచలయ్య మేడిపల్లి : ఎస్.చంద్రశేఖర్‌గౌడ్, శేసం రమాదేవి మూడు చింతలపల్లి: పి.రాధ . -
ఉత్తమ ఉపాధ్యాయులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సంబంధించి ఉత్తమ ఉపాధ్యాయులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. 2019 ఏడాదికి గానూ 13 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఈ మేరకు ప్రక్రియను పూర్తి చేసింది. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జీవీ జగన్నాథరావు, విజయనగరం జిల్లా డెంకాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు ఏ గౌరీప్రసాద్, విశాఖ జిల్లా ఎల్బీ జూనియర్ కళాశాల అధ్యాపకురాలు ఈ నిర్మల, తూర్పు గోదావరి జిల్లా వీటీ జూనియర్ కళాశాల అధ్యాపకులు వై ప్రభాకర్‌రావు, పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ఎంఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వి కేశవప్రసాద్, కృష్ణా జిల్లా దుర్గామల్లేశ్వర మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ పద్మజ, గుంటూరు జిల్లా పెనుమాక ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు ఆర్ వీరభద్రరావు, ప్రకాశం జిల్లా టంగుటూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు కే రాజశేఖర్, నెల్లూరు జిల్లా వెంకటాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకురాలు ఎం విజయలక్ష్మి, చిత్తూరు జిల్లా వాయల్పాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు ఎం.రాధాకృష్ణ, వైఎస్ఆర్ జిల్లా రాయచోటి ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు టి నర్సింహారెడ్డి, కర్నూలు జిల్లా సెయింట్ జోసఫ్ జూనియర్ కళాశాల అధ్యాపకురాలు బి వెంకటలక్ష్మి, అనంతపురం జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వై ప్రశాంతి ఉన్నారు. -
ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఘనంగా జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ కార్యక్రమాని కి ముఖ్యఅతిథులుగా హాజరై అవార్డు గ్రహీతలకు పురస్కారాలు ప్రదానం చేశారు. తెలంగాణ నుంచి నలుగులు, ఏపీ నుంచి ఒకరిని పురస్కారాలు వరించాయి. అవార్డు గ్రహీతల కు జ్ఞాపిక, ప్రశంసాపత్రంతోపాటు రూ.50 వేల నగదు పురస్కారాన్ని ప్రదానం చేశారు. విద్యార్థులకు సులువైన పద్ధతుల్లో విద్యాబోధన, సృజనాత్మకత పెంపులో, పాఠశాలల్లో విద్యార్థుల చేరిక సంఖ్య పెంచడం వంటి అంశాల్లో చేసిన కృషికి గుర్తింపుగా కేంద్రం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పురస్కారాలు ప్రదానం చేస్తోంది. విద్యాబోధనలో అధ్యాపకులు అనుసరిస్తున్న వినూత్న విధానాలను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. శేష ప్రసాద్ నుడుపల్లి,ఆంగ్ల అధ్యాపకురాలు, బేగంపేట బేగంపేట కేంద్రీయ విద్యాలయంలో పనిచేస్తున్న ఆంగ్ల అధ్యాపకురాలు శేష ప్రసాద్ నుడుపల్లికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం దక్కింది. కేవలం మార్కుల కోసమే కాకుండా నిజజీవితంలో ఆంగ్లం ప్రాధాన్యతను గుర్తించి విద్యార్థులను సమాయత్తం చేస్తున్నందుకు కేంద్రం పురస్కారాన్ని ప్రదానం చేసిం ది. ఆంగ్లంపై విద్యార్థుల్లో ఆసక్తి కలిగించేందుకు, ఇతర కార్యక్రమాల్లో ఆంగ్ల భాషను ప్రోత్సహిస్తున్న విధానాలను కేంద్రం గుర్తించింది. బీఎస్ రవి, హెడ్మాస్టర్, జోగులాంబ గద్వాల జిల్లా పాఠశాలలో విద్యార్థుల చేరిక సంఖ్యను పెంచి విద్యా బోధనలో సులువైన సంక్షిప్త విధానాలను రూపొందించడంలో కృషి చేసినందుకు జోగులాంబ గద్వాల జిల్లా అమరావతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ బీఎస్ రవి పురస్కారాన్ని అందుకున్నారు. లైబ్రరీ, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్స్‌పై అవగాహన కల్పిస్తున్నందుకు ఈ పురస్కారం వరించింది. నర్రా రామారావు, హెడ్మాస్టర్, నిజామాబాద్ వీధిబాలలను, పేదరికంలో ఉన్న వారిని విద్యావంతులను చేయడంలో విశేష కృషి చేస్తున్నందుకుగాను నిజామాబాద్ జిల్లా బోర్గాం (పి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ నర్రా రామారావును పురస్కారం వరించింది. కార్మికుల పిల్లలను గుర్తించి, వారిని పాఠశాలలో చేర్పించి విద్యావంతులను చేస్తున్న తీరును కేంద్రం గుర్తించింది. బండారి రమేశ్, స్కూల్ అసిస్టెంట్, వరంగల్ అర్బన్ సెకండరీ స్థాయిలో గణితం బోధనలో 150 సంక్షిప్త విధానాలను ప్రవేశపెట్టి, సులువైన పద్ధతిలో విద్యాబోధన చేస్తున్నందుకు గుర్తింపుగా వరంగల్ అర్బన్ జిల్లా వెంకటాపురం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల స్కూల్ అసిస్టెంట్ బండారి రమేశ్‌ను పురస్కారం వరించింది. సుసత్యరేఖ, గణితం అధ్యాపకురాలు, రాజమహేంద్రవరం గణితం, సైన్స్ బోధనలో టెక్నాలజీని ఉపయోగించి నూతన పద్ధతిలో విద్యాబోధన చేస్తున్నందుకు గుర్తింపుగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎయిడెడ్ ఉన్నత పాఠశాల అధ్యాపకురాలు మేకా సుసత్యరేఖ పురస్కారాన్ని అందుకున్నారు. యాప్‌తో పాటు యూట్యూబ్ వీడియోలు, బ్లాగ్స్ ద్వారా సృజనాత్మక ధోరణిలో ఆమె అవలంబిస్తున్న విద్యా బోధనను కేంద్రం గుర్తించింది. ఈ విధానాల ద్వారా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించటం పట్ల ప్రశంసించింది. -
ఉపాధ్యాయుల చేతిలోనే దేశభవిష్యత్తు
కడప: దేశ భవిష్యత్తు రూపుదిద్దుకునేది పాఠశాలలోనేనని, అందుకు ఉపాధ్యాయులే కీలకపాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ పేర్కొన్నారు. కడప కొత్త కలెక్టరేట్ సభాభవన్‌లో బుధవారం సాయంత్రం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని కలెక్టర్ కేవీ సత్యనారాయణ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డిలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి స్థాయికి ఎదిగి పదవికి వన్నె తెచ్చారని కొనియాడారు. ప్రస్తుత ఉపాధ్యాయులు కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు సామాజిక సృహ, శాస్త్రీయత గురించి నేర్పించాలన్నారు. ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైందని, దేశ భవిషత్తు ఉపాధ్యాయుల చేతిలోనే ఉందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. గత రెండేళ్లుగా విద్యాశాఖ ఉత్తమ ఫలితాలను సాధిస్తోందని, అదే ఫలితాలను ఈసారి కూడా కొనసాగించాలని కోరారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మాట్లాడుతూ గురువులే సమాజానికి దిశానిర్దేశకులన్నారు. మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ సమాజంలో మార్పుకు ఉపాధ్యాయులే కీలకమన్నారు. సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా విద్యపరంగా ముందంజలో ఉన్నామన్నారు. కేజీబీవీల్లో కూడా చక్కటి ఫలితాలతో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి ప్రత్యేక గుర్తింపు పొందామన్నారు. డీఈఓ బండ్లపల్లి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ సీసీఈపై ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి మెటీరియల్ సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో స్టెప్ సీఈఓ మమత, ఆర్‌ఐపీఈ భానుమూర్తిరాజు, డిప్యూటీ ఈఓలు ప్రసన్నాంజనేయులు, రంగారెడ్డి, శైలజ, జెడ్పీ డిప్యూటీ ఈఓ వి.నాగ మునిరెడ్డి, డీఈఓ కార్యాలయ ఏడీ జిలానీబాషా, డీసీఈబీ కార్యదర్శి నారాయణరెడ్డి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
నలుగురు ఉపాధ్యాయులకు అవార్డులు
విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : నలుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్‌లో జెడ్పీఎస్ఎస్ పీజీ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న కొమ్ముల బాబు, హన్మకొండలోని కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్‌అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సుదర్శనం శ్రీనివాసస్వామి, జఫర్ఘడ్ మండలం కూనూరు జెడ్పీఎస్ఎస్లోని పీజీ హెచ్ఎంగా పనిచేస్తూ ఇటీవలే ఉద్యోగ విరమణ పొందిన వై.శోభారాణిలను ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసింది. విద్యాపరంగా, ఇతర సామాజిక సేవలను గుర్తించి వారిని అవార్డులకు ఎంపిక చేశారు. అయితే కొమ్ముల బాబు ప్రభుత్వం నుంచి రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డుకు ఎంపిక కాగా, వై శోభారాణి, ఎ.మల్లారెడ్డి, ఎస్.శ్రీనివాసస్వామిలు నేషనల్ ఫౌండేషన్ టీచర్ వెల్ఫేర్ కింద రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులకు ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 5న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే వేడుకల్లో వీరికి మెడల్‌తోపాటు *3వేలు పారితోషికం, ప్రశంసాపత్రం అందజేస్తారు. వేసవిలోనూ ప్రత్యేకంగా తరగతుల నిర్వహణ బాబు ప్రత్యేకత జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్‌లో జెడ్పీ ఎస్ఎస్ పీజీ హెచ్ఎం కొమ్ముల బాబు వేసవిలోనూ ఎస్సెస్సీ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తారు. దీంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలునాటే కార్యక్రమంలో భాగస్వాములుకావడం, పాఠశాలకు సుమారు *లక్షతో ఫర్నీచర్‌ను స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇప్పించటం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు, ఆరోగ్య, పరిశుభ్రత కోసం ర్యాలీలు, మెగాహెల్త్క్యాంపును నిర్వహించారు. బాలకార్మికులను బడిలో చేర్పించారు.జిల్లా స్థాయిలో ఉత్తమ పీజీహెచ్ఎంగా 2012లో అవార్డు పొందారు. కొమ్ముల బాబు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. తనను రాష్ట్రప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేయటం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు . విద్యతోపాటు విజ్ఞాన కార్యక్రమాల నిర్వహణ హన్మకొండలోని కొత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బయోసైన్స్ స్కూల్‌అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సుదర్శనం శ్రీనివాసస్వామి ఏపీపీఎస్సీ ద్వారా 1996లో స్కూల్‌అసిస్టెంట్‌గా నియమాకం అయ్యారు. విద్యను అందించటంతోపాటు 1998లో యూపీఎస్ గుంటూరుపెల్లి పర్వతగిరిలో పాఠశాల స్థల సేకరణ, ప్రహరీగోడ నిర్మాణం చేపట్టారు. ఈయన జన్మభూమి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా పొందారు. 19990-2000 సంవత్సరంలో ఏజెన్సీ ప్రాంతం ఊట్ల మట్టెవాడలో పాఠశాల భవన నిర్మాణానికి కృషిచేశారు. రెసిడెన్షియల్స్కూల్కు ప్రవేశాలకు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 2000-2001లో అక్షర సంక్రాంతి కార్యక్రమంలో 14గ్రూపులకు అక్షరాస్యులుగా తీర్చిదిద్దినందుకు కూడా ప్రశంసలు అందుకున్నారు. 2009లో గూడూరు మండలంలో ఇంచార్జి ఎంఈఓగా కూడా పనిచేశారు. రాష్ట్రస్థాయిలో విజ్ఞానశాస్త్ర మేళాలు నిర్వహించి అప్పటి విద్యాశాఖ మంత్రి ఎన్.రాజ్యలక్ష్మి చేతుల మీదుగా ప్రశంసలు అందుకున్నారు. 2006-2007లో విజ్ఞాన శాస్త్రప్రయోగ దీపికలో చిత్రాలు గీశారు. 2011లో జిల్లా నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. డీజీ స్కూల్ విద్యాబోధన శోభారాణి ప్రత్యేకత జఫర్ఘడ్ మండలం కూనూరు జెడ్పీఎస్ఎస్లోని పీజీ హెచ్ఎంగా పనిచేస్తూ ఇటీవలే ఉద్యోగ విరమణ పొందిన వై.శోభారాణి పాఠశాల అభివృద్ధికి తోడ్పడటంతోపాటు డీజీ స్కూల్తరహాలో పలువురి సహకారంతో విద్యను అందిస్తూ మన్ననలు పొందారు. దీంతో ఈమెకు ఈ అవార్డు దక్కింది. ఎన్ఆర్ఐ తోట రవీందర్ సహకారంతో డీజీ స్కూల్‌గా ప్రొజెక్టర్‌ను ఏర్పాటు చేయించి తమతోటి ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయించారు. నాలుగు తరగతి గదులను కూడా నిర్మాణం చేయించారు. ఎన్ఆర్ఐతో *లక్ష నిధులను పాఠశాలపేరుపై ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. వచ్చే వడ్డీ రూ.9వేలు ప్రతి ఏడాది టెన్త్‌లో ప్రతిభ చూపిన పేద విద్యార్థులకు పారితోషికంగా అందించేవారు. విద్యాబోధనలో పలుమార్పులు పాటించి ఆ ఉన్నత పాఠశాలలో 47 శాతం ఉన్న ఉత్తీర్ణతను 97శాతం వరకు పెంచగలిగారు. టీసీఎస్ సంస్థ ఆర్థిక సహకారంతో పది కంప్యూటర్లను కూడా ఏర్పాటు చేయించారు. బాల వికాసం సహకారంతో ఒక బోర్వెల్తోపాటు ఓవర్‌హెడ్‌ట్యాంకును నిర్మించేలా కృషిచేశారు. మూతపడిన పాఠశాలను తెరిపించడంలో మల్లారెడ్డి కృషి హన్మకొండ మండలం తరాలపెల్లిలో ప్రస్తుతం పీఎస్ హెచ్ఎంగా పనిచేస్తున్న అనుమాల మల్లారెడ్డి 1993లో ఉపాధ్యాయుడిగా నియమాకమయ్యారు. ములుగు మండలంలోని రాంగనగర్తండాలో 1998లో మూతపడిన పాఠశాలను ఆవాసప్రాంతంలోని విద్యార్థులను 70మందిని ఎన్రోల్మెంట్ చేరుుంచారు. తరగతి గదుల నిర్మాణానికి కృషిచేశారు. కృత్యమేళాలలో మండల స్థాయి, జిల్లా స్థాయిలో పాల్గొని ప్రథమ బహుమతిని పొందారు. విద్యార్థులకు విద్యతో పాటు క్లాప్స్, క్లిప్ నిర్వహించారు. పాఠశాలకు ఏ గ్రేడ్ సర్టిఫికెట్ వచ్చేలా కృషిచేశారు. విద్యార్థులు సృజనోత్సవాల్లో క్విజ్, సాంస్కృతిక కార్యక్రమాల్లో తర్పీదు ఇచ్చారు. అంకితభావంతో పనిచేయటం.. విద్యార్థులకు ప్లేయింగ్ మెథడ్‌లో కూడా విద్యాబోధన చేయడం లాంటి కార్యక్రమాలతో తనకు ఈ అవార్డుదక్కిందని మల్లారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. -
రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు నలుగురు ఎంపిక
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు నలుగురు, నేషనల్ ఫౌండేషన్ టీచర్స్ వెల్ఫేర్(ఎన్‌ఎఫ్‌టీడబ్ల్యూ)కు ముగ్గురు ఎంపికయ్యారు. రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు మొత్తం 57మంది, ఎన్‌ఎఫ్‌టీడబ్ల్యూకు 38 మందిని ఎంపికకాగా వీరిలో జిల్లాకు చెందిన ఏడుగురు ఉపాధ్యాయులు ఉండటం విశేషం. ఉత్తమ ఉపాధ్యాయల అవార్డులకు పెదవేగిలోని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎన్.సంజీవరావు, దెందులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తెర్లి అప్పారావు, చింతలపూడిలోని సీఎస్ఐ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు బొకినాల ఝాన్సీశారదాబాయి, భీమవరం పీఎస్ఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రాఫ్ట్ టీచర్ జీవీ రాజ్యలక్ష్మి ఎంపికయ్యారు. ఎన్‌ఎఫ్‌టీడబ్ల్యూకు తాడేపల్లిగూడెం మండలం లింగరాయుడుగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఎస్.వెంకటరమణ, ఇదే మండలం నందమూరులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని డి.కమలాబాయి, తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయులు కేవీ గణపతిరావు ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాదులోని రవీంద్రభారతిలో గురువారం ఉదయం 10గంటలకు నిర్వహించే కార్యక్రమంలో ఈ ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్మానిస్తారు. రూ.3వేల నగదు, పసిడి పూత పూసిన రజత పతకం, ధ్రువీకరణపత్రం అందజేసి శాలువతో సత్కరిస్తారు.