సీఎం స్వార్థం కోసం హోదా తాకట్టు
సీఎం స్వార్థం కోసం హోదా తాకట్టు
Published Sat, Sep 17 2016 1:43 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
నెల్లూరు (లీగల్):
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ నెల్లూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం కోర్టు విధులను బహిష్కరించారు. అనంతరం జిల్లా కోర్టు ప్రాంగణంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు ఫణిరత్నం మాట్లాడుతూ తన రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని విమర్శించారు. ప్రధాన కార్యదర్శి రోజారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో మోదీ, చంద్రబాబు సంయుక్తంగా తమ వాగ్దానాలతో ప్రజలను న మ్మించారని, ఇప్పుడు ఇద్దరు కలిసి ప్రజలను మోసగిస్తున్నారని దుయ్యబయ్యట్టారు. అనంతరం జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఖాళీ ప్రదేశంలోని పిచ్చి మొక్కలను తొలగించారు.
Advertisement
Advertisement