కేసీఆర్‌ దగాకోరు: బృందాకారత్‌ | CPI-M polit buro member Brinda Karat fire on CM KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ దగాకోరు: బృందాకారత్‌

Published Wed, Jan 25 2017 12:44 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

కేసీఆర్‌ దగాకోరు: బృందాకారత్‌ - Sakshi

కేసీఆర్‌ దగాకోరు: బృందాకారత్‌

ఏటూరునాగారం: కేసీఆర్‌ పెద్ద దగా కోరని,  సెంటిమెంట్‌తో ప్రధాని మోదీ, కేసీఆర్‌లు ప్రజలను మోసం చేస్తున్నారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ అన్నారు. సమన్యాయం, సమగ్రాభివృద్ధిపై సీపీ ఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర మంగళవారం 100వ రోజుకు చేరుకున్న సందర్భం గా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారంలో ఏర్పాటుచేసిన ఆది వాసీ పోడు గర్జన సభలో ఆమె మాట్లాడారు. ప్రజాపోరాటాల ద్వారా ప్రభు త్వాల తీరును ఎండగడతామన్నారు. అక్టోబర్‌ 17న ప్రారంభమైన పాద యాత్ర వంద రోజుల పాటు 2,650 కి.మీ మేర చేపట్టిన రాష్ట్ర నాయకులు 9 మందికి కేంద్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement