భీమవరం: ఆక్వాహబ్ పేరుతో జిల్లాలో విచ్చలవిడిగా సాగుతున్న రొయ్యల చెరువు తవ్వకాలను ప్రభుత్వం తక్షణమే నిలిపి వేయించాలని సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యదర్శి బి.బలరాం ఓ ప్రకటన విడుదల చేశారు.
యండగండి, యనమదుర్రు, పాములపర్రు, కమతవానిగూడెం, మోగల్లు తదితర గ్రామాల్లో సీపీఎం బృందం పర్యటించి రొయ్యల చెరువు తవ్వకాలను పరిశీలించి బాధితులను కలుసుకుందని పేర్కొన్నారు. రెండు పంటలు పండే సారవంతమైన భూములను చెరువులుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు అవినీతికి పాల్పడి అడ్డుగోలుగా అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. చెరువుల తవ్వకాల వల్ల గ్రామాల్లో నీరు కలుషితవుతోందని పేర్కొన్నారు.
రొయ్యల చెరువు తవ్వకాలను నిలిపివేయాలి
Published Mon, May 30 2016 9:16 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
Advertisement
Advertisement