పనితీరు మెరుగుపడాలి | Crime review meet at Nellore | Sakshi
Sakshi News home page

పనితీరు మెరుగుపడాలి

Published Fri, Nov 25 2016 12:12 AM | Last Updated on Sat, Aug 11 2018 8:45 PM

పనితీరు మెరుగుపడాలి - Sakshi

పనితీరు మెరుగుపడాలి

  • నేరాల నియంత్రణకు ప్రణాళిక 
  • ప్రజలకు మెరుగైన సేవలు
  • నేర సమీక్షలో ఎస్పీ విశాల్‌గున్నీ
  •  
    నెల్లూరు (క్రైమ్‌):
    మారుతున్న కాలానికి అనుగుణంగా పని తీరు మెరుగుపరచుకుని ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఎస్పీ విశాల్‌గున్నీ సిబ్బందికి సూచించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానిక ఉమేష్‌చంద్రా  మెమోరియల్‌ కాన్ఫరెన్స్‌హాలులో గురువారం ఆయన నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్కిల్స్‌ వారీగా కేసులను పరిశీలించారు. కేసుల పెండెన్సీని తగ్గించాలని సూచించారు. ‘మన ఊరు–మన పోలీసు’ కార్యక్రమం అమలు తీరుపై సమీక్షింఽచ్చారు. బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల కోసమే తాము పని చేస్తున్నామని మనకు మనం చెప్పుకునే కంటే బాధితులే మన సేవలపై ప్రచార కర్తలుగా మెలిగే విధంగా నడుచుకోవాలని సిబ్బందికి సూచించారు. దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. పాతనేరస్తుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు గస్తీని ముమ్మరం చేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులపై నిçఘా ఉంచాలన్నారు. విజిబుల్‌ పోలీసింగ్‌ను నిర్వహించాలన్నారు. దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పాతనోట్ల రద్దు నేపథ్యంలో ఉత్పన్నమవుతున్న  సమస్యలను చాకచక్యంగా పరిష్కరించాలన్నారు. బ్యాంకుల వద్ద, ఏటీఎం కేంద్రాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు.  దూకుడుగా వ్యవహరించకుండా చట్టపరిధికి లోబడి చర్యలు తీసుకోవాలనిసూచించారు. నగదు అక్రమ రవాణా, నోట్లమార్పిడి పేరిట మోసాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. బాధితులకు అండగా నిలవని.. సరిగా స్పందించని.. పారదర్శకంగా విధులు నిర్వహించని వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. 
    ట్రాఫిక్‌ అధికారులపై అసహనం 
    ట్రాఫిక్‌ అధికారులపై ఎస్పీ విశాల్‌గున్నీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నెల్లూరు నగర వాసులకు మెరుగైన ట్రాఫిక్‌ను అందించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నా ఫలితాలు నామమాత్రంగా ఉండటంపై ఆయన మండిపడ్డారు. ప్రతి రోజు ట్రాఫిక్‌పై తనకు ఫిర్యాదులు అందుతున్నాయని, దీన్ని బట్టి అధికారులు, సిబ్బంది పనితీరు ఏ పాటిదో  చెప్పాల్సిన అవసరం లేదన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వీడకపోతే ఎవరూ కాపాడరని సిబ్బందిని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ బి. శరత్‌బాబు, ఏఆర్‌ ఏఎస్పీ వీరభద్రుడు, క్రైం ఓఎస్‌డీ విఠలేశ్వర్, డీఎస్పీలు ఎన్‌. కోటారెడ్డి, జి. వెంకటరాముడు, తిరుమలేశ్వర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, రాఘవరావు, శ్రీనివాసులు, శ్రీనివాసాచారి, బాలసుందరం, సుధాకర్, శ్రీనివాసరావు, రామారావు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement