మళ్ళీ మొసలి పిల్ల కలకలం
Published Sun, Nov 6 2016 10:55 PM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM
కొత్తపేట :
కొత్తపేట మండలం అవిడి పంట కాలువలో ఆదివారం సాయంత్రం మొసలి పిల్ల మళ్లీ కలకలం సృష్టించింది. బొబ్బర్లంక–అమలాపురం ప్రధాన పంట కాలువ నుంచి అనుసంధానంగా మండల పరిధిలోని పలివెల లాకుల సమీపం నుంచి వెళ్లిన అవిడి–మాచవరం ³ల్ల కాలువలో అవిడి రేవు సమీపంలో డామ్ వద్ద శనివారం రాత్రి యువకులకు మొసలి పిల్లలు కనిపించి అదృశ్యమైన విషయం తెలిసిందే. కాగా ఇరిగేష¯ŒS సిబ్బందికి సమాచారం ఇచ్చి కాలువకు నీటి సరఫరా నిలిపివేశారు. దీంతో కాలువలో నీరు తగ్గడంతో ఒక మొసలి పిల్ల కాలువ గట్టుపైకి ఎక్కి తుప్పల్లోకి వెళ్లింది. ఈ విషయం గ్రామం అంతటా వ్యాపించడంతో జనం భారీగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దానితో తుప్పల్లోంచి మళ్లీ కాలువలోకి వెళ్లిపోయింది.
Advertisement
Advertisement