అనంతపురం ఎడ్యుకేషన్ : డీఎడ్ ద్వితీయ సంవత్సరం(2014–16 బ్యాచ్) విద్యార్థులు ఈ నెల 15లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి అంజయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు 16న ట్రెజరీలో జమ చేయాలని, 17న నామినల్‌రోల్స్ చలానాలు డీఈఓకు అందజేయాలని సూచించారు. అలాగే రూ. 50 అపరాధ రుసుంతో ఈనెల 22 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని, 23న ట్రెజరీలో జమ చేయాలని, 24న నామినల్‌రోల్స్ చలానాలు డీఈఓకు అందజేయాలని సూచించారు.
ఫీజుల వివరాలు ఇలా..
రెగ్యులర్ విద్యార్థులు రూ. 250, ప్రైవేట్ విద్యార్థులు 4,5 సబ్జెక్టులకు రూ. 250, మూడు సబ్జెక్టులకు రూ. 175, రెండు సబ్జెక్టులకు రూ.150, ఒక సబ్జెక్టుకు రూ. 125 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నామినల్ రోల్స్, చలానాలు గతంలో పరీక్షల డైరెక్టర్ కార్యాలయం, హైదరాబాద్‌లో అందజేసేవారని, ఈ ఏడాది డీఈఓ కార్యాలయంలోనే అందజేయాలని సూచించారు.
‘డీఎడ్’ పరీక్ష ఫీజు 15లోగా చెల్లించాలి
Published Fri, Sep 2 2016 10:55 PM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM
Advertisement