తెనాలి నుంచి సికింద్రాబాద్‌కు వెళుతున్న డెల్టా ప్యాసింజర్‌కు ప్రమాదం తప్పింది. నల్లగొండ జిల్లా టేకుల సోమవారం వద్ద గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కల్వర్ట్‌పై ట్రాక్ కింద ఉన్న కంకర కొట్టుకుపోయింది. సిబ్బంది ముందుగానే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు వెంటనే రైలును నిలిపివేశారు. రైల్వే సిబ్బంది రంగంలోకి దిగి ట్రాక్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.
3 గంటల తర్వాత బయల్దేరిన ప్యాసింజర్
తెనాలి నుంచి సికింద్రాబాద్‌కు వెళుతున్న డెల్టా ప్యాసింజర్ మూడు గంటల తర్వాత తిరిగి బయల్దేరింది. నల్లగొండ జిల్లా టేకుల సోమవారం బొల్లేపల్లి గేటు వద్ద అండర్‌పాస్ బ్రిడ్జిపై మట్టి కొట్టుకుపోవడంతో శుక్రవారం ఉదయం 5.30గంటల సమయంలో రైలును నిలిపివేశారు. ఇక్కడ రైల్వే గేటు వద్ద కాపలాదారుడిని తీసేసి అండర్‌పాస్ నిర్మిస్తున్నారు. ఈ అండర్‌పాస్‌పై ఉన్న మట్టి కొట్టుకుపోవడంతో ఓ పాల రైతు శుక్రవారం తెల్లవారుజామున గుర్తించి రైలును ఆపివేశాడు. గంటన్నర తర్వాత రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది ట్రాక్‌ను పునరుద్ధరించారు. దీంతో దాదాపు మూడు గంటల తర్వాత 8.20గంటల సమయంలో రైలు ముందుకు కదిలింది.