డెంగీతో వణుకుతున్న దివిసీమ
డెంగీతో వణుకుతున్న దివిసీమ
Published Tue, Aug 30 2016 11:40 PM | Last Updated on Mon, Oct 1 2018 5:19 PM
ఎటుచూసినా జ్వరాల పీడితులే
చికిత్స కోసం పట్టణాలకు పరుగులు
‘మాజేరు’ను తలచుకుని వణుకు
కన్నెత్తిచూడని వైద్యాధికారులు
అవనిగడ్డ:
డెంగీ, వైరల్ జ్వరాలు రోజురోజుకీ విజృంభించడంతో దివిసీమవాసులు బెంబేలెత్తి పోతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో పలు రకాల జ్వరాలతో జనం బాధపడుతున్నారు. నెలరోజుల క్రితం అవనిగడ్డ మండల పరిధిలోని రామకోటిపురంలో సుమారు 75 మంది వరకూ జ్వరాలబారిన పడగా, వీరిలో 18 మంది డెంగీ లక్షణాలతో చికిత్స తీసుకున్నారు. దీనిపై ప్రజల్లో గగ్గోలు రేగడంతో ఈ నెల 15 నుంచి గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు. పక్కనే ఉన్న కొత్తపేటకు జ్వరాలు విస్తరించాయి. ఈ రెండు గ్రామాల్లో వంద మందికి పైగా పలు రకాల జ్వరాలతో చికిత్స పొందారు. ఇక్కడి వైద్యశిబిరానికి వచ్చిన 13 మంది డెంగీ అనుమానితులను విజయవాడ ఆస్పత్రులకు పంపినట్లు స్థానిక పీహెచ్‌సీ వైద్యుడు డా.శివరామకృష్ణ తెలిపారు. అవనిగడ్డలో వీఆర్వోగా పనిచేస్తున్న వీఆర్వో శేషుబాబు, ఆయన భార్యకి డెంగీ జ్వరంతో విజయవాడలో చికిత్స పొందుతున్నారు. పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులదీ ఇదే పరిస్థితి.
రోజురోజుకూ విజృంభిస్తున్న జ్వరాలు
ప్రస్తుతం దివిసీమలోని వైద్యశాలలన్నీ జ్వర పీడితులతో కిక్కిరిసి పోతున్నాయి. కోడూరు మండలంలోని విశ్వనాధపల్లి, వి కొత్తపాలెం, కోడూరులో పలువురు డెంగీ లక్షణాలతో వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. అవనిగడ్డ మండలంలోని కొత్తపేట, రామకోటిపురం, మోదుమూడి, అశ్వరావుపాలెం, వేకనూరు, అవనిగడ్డ, మోపిదేవి మండలంలోని పెదకళ్లేపల్లి, నాగాయతిప్ప, కొక్కిలిగడ్డ, కె కొత్తపాలెం, పెదప్రోలు, చల్లపల్లి మండలంలోని లక్ష్మీపురం, రామానగరం గ్రామాల్లో జ్వరాల బాధితులు ఎక్కువుగా ఉన్నారు. సుమారు వందమంది వరకూ డెంగీకి గురైనట్లు అంచనా.
మేల్కొనకపోతే మరింత ప్రమాదమే
గత ఏడాది జూౖలై నుంచి సెప్టెంబర్ మధ్య చల్లపల్లి మండలం మాజేరులో 16 మంది డెంగీ, విషజ్వరాలుబారిన పడి మరణించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోçß毌æరెడ్డి ఈ గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబాలకు భరోసా కల్పించడంతో పాటు, బాధిత కుటుంబాలతో మచిలీపట్నంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం తెలిసిందే. ఇప్పటికైనా అధికారులు మేల్కొని పారిశుధ్య పనులు, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని దివిసీమ ప్రజలు కోరుతున్నారు.
Advertisement