పేపర్ల లీక్‌ వ్యవహారంపై దర్యాప్తు | deo enquiry on paper leak issue | Sakshi
Sakshi News home page

పేపర్ల లీక్‌ వ్యవహారంపై దర్యాప్తు

Published Sat, Mar 25 2017 11:44 PM | Last Updated on Tue, Sep 5 2017 7:04 AM

deo enquiry on paper leak issue

కదిరి టౌన్‌ : టెన్త్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారంపై దర్యాప్తు చేపడుతున్నామని జిల్లా విద్యాశాఖాధికారి లక్ష్మీనారాయణ తెలిపారు. శనివారం ఆయన కదిరిలోని పదోతరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర, బాలికలతోపాటు మున్సిపల్‌ హైస్కూల్, షిరిడిసాయి, బ్లూమూన్‌ పాఠశాల పరీక్షా కేంద్రాలను ఆయన పరిశీలించారు. కేంద్రాల్లో విద్యార్థులు రాస్తున్న పరీక్షా విధానాన్ని పరిశీలించి చీఫ్‌ అధికారులు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులకు సూచనలందించారు. 

ఈ సందర్భంగా జిల్లాలోని మడకశిర, కూడేరు, కదిరి పరీక్షా కేంద్రాల నుంచి ప్రశ్నాపత్రాల లీక్‌ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని మీడియా ప్రశ్నించారు. దీనికి డీఈఓ సమాధానమిస్తూ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై దర్యాప్తు చేపడుతున్నామని, అందుకు పోలీస్‌ శాఖ కూడా  బాధ్యులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement