పెన్షన్..టెన్షన్
ఆన్‌లైన్‌లో నెలవారీ పింఛన్లు జమ
ఏటీఎంలో డ్రా చేసుకోవాల్సిందే
డెబిట్..రూపే కార్డుల్లేని వారెందరో..
వృద్ధులు..వికలాంగుల పరిస్థితి దయనీయం
పండుటాకులకు పింఛన్ ఆందోళన మొదలైంది. పింఛన్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు చెబుతుండడం పెన్షనర్లలో గుబులు రేపుతోంది. నగదు రూపంలో పెన్షన్లు చెల్లించకపోతే ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ వస్తే ఆనందించే పెన్షనర్లు.. ఇప్పుడు మాత్రం దిగాలు పడుతున్నారు.
సాక్షి: జిల్లాలో 3,97,728 మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. దీని కోసం రూ.41.85 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పెన్షనర్లతో వేలిముద్ర వేరుుంచుకొని ప్రతినెలా పింఛన్ పంపిణీ చేస్తోంది. మారిన పరిస్థితుల దృష్ట్యా ఈ నెల అకౌంట్లలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్ల రద్దుతో రిజర్వ్‌బ్యాంకు విధించిన ఆంక్షలతో కోట్లాది రూపాయలు పంచే పరిస్థితి కనిపించడం లేదు. నగదు రూపంలో పెన్షన్లు పంపిణీకి ప్రభుత్వం వెనకడుగు వేసింది. నిస్సహాయులకు మానవతాద క్పథంతో నగదు రూపంలో పంపిణీకి సర్కారు ససేమిరా అనడంతో.. అధికారులు ప్రత్యామ్నాయంగా ఖాతాల్లోనే జమచేయాలని నిర్ణరుుంచారు. ఖాతాల్లోని నగదును రూపే కార్డులతో డ్రా చేసుకునేలా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
40 వేల మందికే రూపే...
3.97లక్షల మంది పింఛనుదారులు ఉండగా సుమారు 3,22,691 మందికి బ్యాంకు ఖాతాలున్నాయని అధికారులు చెబుతున్నారు. బ్యాంకు ఖాతాలు సుమారు 80 శాతం ఉన్నా.. నగదు డ్రా చేసుకోడానికి రూపే కార్డులు మాత్రం కేవలం 43,316 మందికి మాత్రమే జారీ చేశారు. దీంతో లబ్ధిదారులకు పింఛన్ అకౌంట్లో జమ చేసినా ప్రయోజం అంతంత మాత్రమే. బ్యాంకు మిత్రలు జిల్లాలో తగినంత మంది లేకపోవడం కూడా పెన్షనర్లను బాధించే అంశమే.
రూ.2 వేలు మాత్రమే ఉంది..
ఏటీఎంలు అన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నారుు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయకపోవడంతో కొన్ని ఏటీఎంలు పని చేయడం లేదు. ఒక వేళ పని చేసినా రూ.2 వేల నోట్లు మాత్రమేవస్తున్నారుు. మరి రూ.1000, రూ.1500 పింఛన్లు ఎలా పంపిణీ చేస్తారనే సందేహం పెన్షనర్లలో నెలకొంది. కొత్త రూ.500 నోట్లు వచ్చినా కొంత మేర పంపిణీ జరిగింది.
అకౌంట్లలో జమ చేస్తాం..
పింఛన్లు అకౌంట్లలో జమ చేస్తాం. రూపే కార్డులు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నాం. బ్యాంకు మిత్రల ద్వారా పింఛన్ పంపిణీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నాం. - రవిప్రకాశ్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ, చిత్తూరు.