36వేల మందికి ఆసరా పింఛన్లు నిలిపివేసిన సెర్ప్
సాక్షి, హైదరాబాద్: ఆసరా పింఛన్లను నేరుగా లబ్ధిదారుడికి అందించే మాన్యువల్ పంపిణీ విధానానికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) చెల్లుచీటి ఇచ్చింది. ఇకపై ఈ పథకంలోని 36 లక్షల మంది లబ్ధిదారులకు బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ఖాతాల ద్వారానే పింఛన్ సొమ్మును అందించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల నుంచే కొత్త విధానం అమల్లోకి రావడంతో గత డిసెంబర్ నెల పింఛన్‌ను జనవరిలో అందుకోవాల్సిన సుమారు 35,937 మంది లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పలేదు. సదరు లబ్ధిదారులకు బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ఖాతాలు లేనందున డిసెంబర్ పింఛన్లను నిలిపివేశామని, ఒకవేళ వారు వెంటనే ఖాతాలు తెరిచినట్లయితే వచ్చే నెల పింఛన్‌తోపాటు బకాయిలను అందజేస్తామని సెర్ప్ అధికారులు చెబుతున్నారు.
బ్యాంక్ ఖాతాలుంటేనే పింఛన్లు!
Published Sat, Jan 28 2017 2:35 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement