అడ్డంకులు ఎదురైనా జనగర్జన నిర్వహిస్తాం | Despite the obstacles, handling janagarjana | Sakshi
Sakshi News home page

అడ్డంకులు ఎదురైనా జనగర్జన నిర్వహిస్తాం

Published Sun, Sep 18 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

Despite the obstacles, handling janagarjana

  • ∙జనగామ జిల్లా కోసం 
  • నేడు అన్ని గ్రామాల్లో డప్పుచాటింపు
  • ∙సభ అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించాం
  • ∙21న 50వేల అభ్యంతరాలను కలెక్టర్‌కు అప్పగిస్తాం
  • దశమంతరెడ్డి
  • జనగామ :  జనగామ జిల్లా సాధన కోసం ఈ నెల 20న తలపెట్టిన జనగర్జన సభకు ఎన్ని అడ్డం కులు ఎదురైనా నిర్వహించి తీరుతామని జేఏసీ చైర్మ¯ŒS ఆరుట్ల దశమంతరెడ్డి అన్నారు. స్థానిక జూబ్లీఫంక్ష¯ŒS హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అఖిలపక్ష నాయకులు ఆముదాల మల్లారెడ్డి, మేడ శ్రీనివాస్, బెడిదె మైసయ్యలతో కలిసి ఆయన మాట్లాడారు. శాంతియుతంగా జరుపుకునే సభకు అనుమతి లేదనడం హాస్యాస్పదమన్నారు. డివిజ¯ŒSలోని 16 మండలాల నుంచి లక్షకు పైగా జనం స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సభ నిర్వహణ కోసం హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. నేడు అన్ని గ్రామాల్లో డప్పు చాటింపు చేయాలని పిలుపునిచ్చారు.19న ఇంటింటికి బొట్టు పెట్టి ఆహ్వానం పలుకుతామన్నారు. పట్టణంలో వార్డుల వారీగా కమిటీలు  వేసి, వందశాతం ప్రజలు సభకు తరలివచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఆయా రాజకీయ పార్టీలు, అనుబంధ సంస్థలను ఏకతాటిపైకి తీసుకు వచ్చి, సభకు వచ్చేందుకు ఏకగ్రీవ తీర్మానాలు సైతం చేస్తున్నారన్నారు. సభ విజయవంతానికి పట్టణం నుంచి చేర్యాల, పాలకుర్తి నియోజకవర్గాల వైపు వెళ్లిన బైక్‌ ర్యాలీకి అనూహ్య స్పందన లభించిందన్నారు. సిద్దిపేట జిల్లాపై వస్తున్న అభ్యంతరాల వివరాలు రాత్రికి రాత్రే మార్చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 21న జిల్లా కలెక్టర్‌కు 50 వేల అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా అందజేస్తామని చెప్పారు. ఆ¯ŒSలై¯ŒS, రాతపూర్వకంగా లక్ష అభ్యంతరాలను ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. సమావేశంలో నాయకులు పజ్జూరి గోపయ్య, ఆకుల వేణుగోపాల్‌రావు, మాశెట్టి వెంకన్న, ఆలేటి సిద్దిరాములు, బూడిద గోపి, నక్కల యాదవరెడ్డి, మంగళ్లపల్లి రాజు, మోకు కనకారెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, జక్కుల వేణుమాధవ్, మాజీద్, పిట్టల సురేష్, నవీ¯ŒS, నర్సింహులు, యాదగిఇర, మల్లేష్‌ తదితరులు ఉన్నారు.
    వినూత్న నిరసన
    ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి, జనగామను జిల్లా చేయాలని కోరుతూ ఓ యువకుడు శనివారం వినూత్నంగా నిరసన తెలిపాడు. పట్టణానికి చెందిన గండి నాగరాజు జనగామ జిల్లా కోసం జరుగుతున్న కట్రలను నిరసిస్తూ ఒంటి నిండా నల్లరంగుతో నిరసన తెలుపుతూ, అధికారికంగా విమోచనం కోసం జాతీయ జెండాతో పాటు బీజేపీ బ్యానర్‌ పట్టుకుని పట్టణంలోని పలు వార్డులో పర్యటించాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement