నెల్లూరు : తెలుగు రాష్ట్రాల్లో సంచనలం సృష్టిస్తున్న సైకో సూది వ్యవహరాన్ని పెద్దది చేయవద్దని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి.రాముడు మీడియాకు సూచించారు. ఈ అంశాన్ని పద్దది చేసి మరింత మందికి ఆలోచన కల్పించ వద్దని కోరారు. ఆదివారం నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా తడలో చెక్పోస్ట్ వద్ద ఐ క్లిక్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... పోలీస్ శాఖలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంపొందిస్తామని ఆయన తెలిపారు. ఆ తర్వాత భీమునిపాలెం చెక్ పోస్ట్ పనితీరును జె.వి.రాముడు పరిశీలించారు.