డిజిటల్ యూనివర్సిటీకి సంబంధించి ఎంవోయూ చేసుకుంటోన్న అధికారులు
తిరుపతిలో డిజిటల్ వర్సిటీ
Published Fri, Sep 30 2016 10:52 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM
– ఫోరెన్సిక్, ఫ్రాక్సిస్ సంస్థలతో ప్రభుత్వ ఒప్పందం
– ఈ ఏడాది 2 కోర్సులకు 50 సీట్లు కేటాయింపు
సాక్షి ప్రతినిధి, తిరుపతి :
తిరుపతి ఎస్వీయూ ప్రాంగణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డిజిటల్ యూనివర్సిటీని నెలకొల్పేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కంప్యూటర్ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ (ఐవోటీ)ను అభివృద్ధి చేసేందుకు రాబోయే తరాలకు డిజిటల్ వర్సిటీ ఉపకరిస్తుందని సర్కారు భావించింది. ఇందుకోసం తొలి విడత కింద రూ.39.97 కోట్లు కేటాయించింది. శుక్రవారం విజయవాడలో గుజరాత్‌కు చెందిన ఫోరెన్సిక్ యూనివర్సిటీ, కోల్‌కతాకు చెందిన ఫ్రాక్సిస్ బిజినెస్ స్కూల్ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ చేసుకుంది. యూనివర్సిటీ ఏర్పాటు బాధ్యతలను ఈ సంస్థలకు అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వ ఐటీ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, ముఖ్యమంత్రి ఐటీ సలహాదారు జేఏ చౌదరి ఆయా సంస్థలతో ప్రత్యేకంగా సమావేశమై తిరుపతిలో ఏర్పాటుచేసే డిజిటల్ యూనివర్సిటీపై సమీక్షించారు. అనంతరం వర్సిటీ ఏర్పాటుపై ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్రంలో రానురాను సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. కంప్యూటర్ రంగంలోనూ, డాటా అనాలిటిక్స్‌లోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఈ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటేనే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధ్యం. ఈ దిశగా యోచించిన ప్రభుత్వం మొట్టమొదటి డిజిటల్ యూనివర్సిటీని తిరుపతి ఎస్వీయూ క్యాంపస్‌లో నెలకొల్పాలని చూస్తోంది. ఇందుకోసం గుజరాత్‌లోని ఫోరెన్సిక్ యూనివర్సిటీ సాయాన్ని కోరింది. సైబర్, బయాటిక్, డాటా సేఫ్ వంటి ఐదు కోర్సులను యూనివర్సిటీలో అందుబాటులో ఉంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది రెండు కోర్సులను ప్రవేశపెట్టి 50 సీట్లు భర్తీ చేయాలని యోచిస్తోంది. ఎస్వీయూలోని 40 వేల చదరపు గజాల స్థలాన్ని కూడా పరిశీలించింది. ఇప్పటికే నిర్మించి ఉన్న ఓ భవనాన్ని తీసుకుని అందులో కోర్సులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ వారు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తారని ప్రభుత్వం చెబుతోంది. ఏడాదికి యాభై సీట్లు పెంచుకుంటూ మూడేళ్లలో 150
Advertisement
Advertisement