పంచలింగాల సమీపంలోని జిల్లా జైలును సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంస్థ కార్యదర్శి, జిల్లా లోక్ అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జిల్లా జడ్జి ఆకస్మిక తనిఖీ
Apr 18 2017 12:39 AM | Updated on Sep 5 2017 9:00 AM
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పంచలింగాల సమీపంలోని జిల్లా జైలును సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంస్థ కార్యదర్శి, జిల్లా లోక్ అదాలత్ జడ్జి ఎంఏ సోమశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలు పరిసరాలు, గదులు, ఖైదీలకు ఇచ్చే ఆహారాన్ని పరిశీలించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడుతూ సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పట్టువిడుపులకు పోయి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. న్యాయవాదిని నియమించుకోలేని వారికి న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఏ.చంద్రశేఖర్, ఎంఏ తిరుపతయ్య, జి.నాగముని పాల్గొన్నారు.
Advertisement
Advertisement