ఉచితంగా తిరుమల యాత్ర, దర్శనం | Divya darshanam Scheme offers Free trip to Tirumala | Sakshi
Sakshi News home page

ఉచితంగా తిరుమల యాత్ర, దర్శనం

Published Thu, Jun 9 2016 8:31 PM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

ఉచితంగా తిరుమల యాత్ర, దర్శనం

ఉచితంగా తిరుమల యాత్ర, దర్శనం

హైదరాబాద్ : గ్రామీణ, పట్టణ పేదలను ఉచితంగా తిరుమల యాత్రకు తీసుకెళ్లడానికి ఏపీ దేవాదాయ శాఖ కొత్తగా ప్రవేశపెట్టదలిచిన 'దివ్యదర్శనం' పథకం విధివిధానాలను ఆ శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం గరిష్టంగా ఇంటికి ఐదుగురికి అవకాశం కల్పిస్తారు. మూడు ఏళ్ల లోపు పిల్లలను అదనంగా తీసుకెళ్లవచ్చు. హిందూమతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందినవారినే ఈ పథకంలో 90 శాతం లబ్దిదారులుగా ఎంపిక చేస్తారు.

అగ్ర కులాల్లో తెల్లకార్డులున్నవారిని, అదీ 70 ఏళ్ల లోపు వారే అర్హులు. ప్రతి జిల్లా నుంచి విడతల వారీగా ఏడాదికి పదివేల మందికి ఉచిత తిరుమల దర్శనం కల్పిస్తారు. ఉచిత తిరుమల యాత్ర 4-5 రోజుల పాటు ఉండేలా.. తిరుమల యాత్రతో పాటు మార్గమధ్యంలో నాలుగు ప్రధాన ఆలయాల దర్శనానికి అవకాశం కల్పిస్తారు. ఈ పథకానికయ్యే ఖర్చును టీటీడీ నిధులతో పాటు రాష్ట్రంలో ఏడు ప్రధాన దేవాలయాల ఆదాయం నుంచి ఖర్చు చేస్తారు. ఉచిత యాత్ర సమయంలో లబ్దిదారులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించడానికి దేవాదాయ కమిషనర్ చర్యలు చేపడతారని ఉత్తర్వులో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement