మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్
నిర్వాసితులకు న్యాయం చేయాలి
Published Sat, Aug 13 2016 9:24 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
నాగర్‌కర్నూల్ : పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో ముంపునకు గురై భూమి, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.డి.జబ్బార్ అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్‌లోని సీఐటీయూ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. జీఓ నం.123ని ప్రభుత్వం అమలు చేయాలని చూస్తే భూ నిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమించడం వల్ల హైకోర్టు ఈ జీఓను కొట్టివేసిందన్నారు. 2013చట్టం ప్రకారమే రైతులకు పరిహారం చెల్లించాలని సూచించిందన్నారు. అయినా మరోసారి జీఓ నం.190, సమన్వయ కమిటీ పేరుతో భూనిర్వాసితులను ప్రభుత్వం మోసం చేయాలని చూస్తోందని ఆరోపించారు. నార్లాపూర్, వట్టెం, కర్వెన, ఉద్దండాపూర్, ఏదుల రిజర్వాయర్ పరిధిలో 39గ్రామాలు మునిగిపోతే ఇప్పటికీ ఆదుకోలేదన్నారు. తక్షణమే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంతోపాటు భూ నిర్వాసితులను అన్నివిధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు ఆర్.శ్రీనివాస్, నాయకులు లక్ష్మణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement