16న వైద్యుల సత్యాగ్రహం
16న వైద్యుల సత్యాగ్రహం
Published Sat, Nov 12 2016 10:12 PM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM
కర్నూలు(హాస్పిటల్): వైద్యులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈ నెల 16వ తేదీన కలెక్టరేట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహం పేరుతో ఆందోళన నిర్వహించనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు, అధ్యక్ష, కార్యదర్శులు బాలమద్దయ్య, శంకరశర్మ, మల్లికార్జున్ చెప్పారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నేషనల్ మెడికల్ కమిషన్‌ను తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ కమిషన్ ఏర్పాటుతో వైద్యవృత్తిలో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తుల పాలన ఎక్కువవుతుందన్నారు. ఆయుర్వేద, హోమియో వైద్యులకూ అల్లోపతి వైద్యం చేసే వీలు కల్పిస్తుందన్నారు. ఇది ఏ మాత్రం సరికాదన్నారు. దీనివల్ల అల్లోపతి వైద్యులు తమ హక్కులు కోల్పోతారన్నారు. వైద్యులు, ఆసుపత్రులపై దాడికి పాల్పడకుండా సెంట్రల్ ప్రొటెక‌్షన్ లాను తీసుకురావాలని, పీసీ పీఎన్‌డీటీ యాక్ట్‌లో సవరణ చేయాలని, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్, కన్జూ్యమర్ ప్రొటెక‌్షన్ యాక్ట్ సవరణ తదితర డిమాండ్లతో సత్యగ్రహం చేయనున్నట్లు తెలిపారు.
Advertisement