కొత్తపల్లి :
హెచ్చరికలు పట్టించుకోకుండా సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల బోట్ల లైసెన్సులను రద్దు చేస్తామని మత్స్యశాఖ డీడీ అంజలి హెచ్చరించారు. మండలంలోని తీరప్రాంతాన్ని శనివారం ఆమె పరిశీలించారు. వార్దా తుపాను తీరం దాటే సమయంలో ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. 12వ తేదీ వరకూ వేటకు వెళ్ళరాదన్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు రిలయ¯Œ్స ఫౌండేషన్, జిల్లా మత్స్య శాఖ ద్వారా ఇప్పటికే సమాచారం ఇచ్చామన్నారు. వేట నుంచి తిరిగి వచ్చిన మత్స్యకారులు రిలయ¯Œ్స ఫౌండేష¯ŒS ఐవీ ఆర్‌ఎస్ టోల్ ఫ్రీ నెంబరు 1800 2700268కు ఫో¯ŒS చేసి వివరాలను నమోదు చేయించుకోవాలన్నారు. తీర ప్రాంతంలో లంగరు వేసిన బోట్లను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మత్స్యకారులకు సూచించారు. తీరప్రాంతంలో ఉన్న మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తొండంగి మండలం నుంచి మలికిపురం వరకూ ఉన్న తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేకాధికారులు నియమితులైనట్టు చెప్పారు. తుపాను తీరం దాటే సమయంలో బలమైన గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుందన్నారు. ఆమె వెంట మత్స్యకార నాయకుడు బందన రాంబాబు, ఎఫ్‌డీఓ చక్రపాణి, సిబ్బంది ఉన్నారు.