బెక్కర్‌పల్లిలో రాస్తారోకో చేస్తున్న గ్రామస్తులు
అమరచింతలో విలీనం చేయొద్దు
Published Thu, Aug 25 2016 12:59 AM | Last Updated on Fri, Sep 28 2018 7:36 PM
నర్వ: కొత్తగా ఏర్పడనున్న బెక్కర్‌పల్లి గ్రామపంచాయతీని అమరచింత మండలంలో విలీనం చేస్తామనడం సమంజసం కాదని బెక్కర్‌పల్లి గ్రామస్తులు బుధవారం రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. అమరచింత వద్దు..నర్వ మండలమే ముద్దు అంటూ నినాదాలు చేస్తు వాహన రాకపోకలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీలు వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ లు మాట్లాడుతూ కొత్త మండలాల ఏర్పాటు వ్యవహారంలో నర్వ మండలంలో కొనసాగుతున్న గ్రామాలను గ్రామప్రజల ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిశీలించకుండానే కొత్త మండలంలోకి నెట్టివేయడం అవివేకం అన్నారు. గ్రామస్తుల అభిప్రాయాల మేర ప్రభుత్వం స్పందించాలని తమ మండలాన్ని ప్రస్తుతం ఉన్న నర్వ మండలంలోనే కొనసాగేలా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళనలు చేస్తానని హెచ్చరించారు. నాయకులు నారాయణ, సుధాకర్ రెడ్డి, బాల్‌రెడ్డి, హన్మంతు లతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
నర్వ వద్దు..
నర్వ మండలంలో కొనసాగుతున్న క్రిష్ణంపల్లి గ్రామాన్ని నూతనంగా ఏర్పాటుచేయనున్న అమరచింత మండలంలో చేర్చడం హర్షించదగ్గ విషయమంటూ ఆ గ్రామ ఉపసర్పంచ్ మల్లా రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం మిఠాయిలను పంచుతూ సంబురాలను జరుపుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా నర్వ మండలంలో ఉన్న క్రిష్ణంపల్లి గ్రామాన్ని రిహాబిటేషన్ ద్వారా నందిమళ్ల ఎక్స్‌రోడ్డులో భవనాలను నిర్మించి గ్రామాన్ని ఏర్పాటుచేశారన్నారు.కాని, ప్రస్తుతం క్రిష్ణంపల్లి గ్రామాన్ని ఆత్మకూర్ మండలంలోకి చేర్చడం రెవెన్యూ భూములన్ని కూడా నర్వ మండలంలోనే కొనసాగడంతో నిత్యం విసిగి వేసారి పోతున్నామన్నారు. తమ సమస్యను పరిష్కరించమని కలెక్టర్, ప్రజాప్రతినిధులకు విన్నవించిన ఫలితం దక్కలేదన్నారు. ప్రస్తుతం నూతనంగా ఏర్పాటుచేయనున్న అమరచింత మండలంలో తమ గ్రామాన్ని చేర్చడంతో రెవెన్యూ , పాలనాసౌలభ్యం కేంద్రీకతం అయ్యే వీలు కలిగిందన్నారు. కార్యక్రమంలో వార్డుసభ్యులు లింగమ్మ, గోవిందమ్మ, నాయకులు కుర్మన్న, తిమ్మారెడ్డి, శ్రీనివాసులు, హరీష్, గ్రామ మహిళాసం«ఘం అధ్యక్షురాలు రంగమ్మ పాల్గొన్నారు.
Advertisement
Advertisement