మండలంలోని ముప్పలకుంట గ్రామంలో గ్రామ కార్యదర్శి దళిత భవానీని కులం పేరుతో దూషించి దేవాలయంలోకి రాకుండా అడ్డుకున్న కేసులో విచారణకు శనివారం ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ మహబూబ్ బాషా గ్రామంలో పర్యటించారు.
బ్రహ్మసముద్రం : మండలంలోని ముప్పలకుంట గ్రామంలో గ్రామ కార్యదర్శి దళిత భవానీని కులం పేరుతో దూషించి దేవాలయంలోకి రాకుండా అడ్డుకున్న కేసులో విచారణకు శనివారం ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ మహబూబ్ బాషా గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా సంఘటన జరిగిన నల్లలమ్మ ఆలయాన్ని పరిశీలించారు.
అనంతరం సంఘటనకు సంబంధించిన విషయాన్ని గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసుకు సంబంధించిన వివరాలను ఎస్‌హెచ్‌ఓ రఘురాములును అడిగి తెలుసుకున్నారు. సంఘటనకు భాధ్యుడైన చంద్రపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.