రాష్ట్ర ముఖ్యమంత్రి సభకు ఆర్టీసీ, ప్రైవేట్, ఇతర వాహనాల్లో జిల్లా నలుమూలల నుంచి డ్వాక్రా మహిళలను తరలించారు. కడప మార్కెట్ యార్డ్‌కు జిల్లా నలుమూలల నుంచి అక్కడకు తీసుకుని వచ్చి వదిలిపెట్టారు. బస్సులన్నీ మార్కెట్ యార్డ్‌లో పార్కింగ్ చేశారు. కడప రీజనల్ పరిధిలో వివిధ డిపోలనుంచి 28 ఆర్టీసీ బస్సులను నడిపారు.
కడప అర్బన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి సభకు ఆర్టీసీ, ప్రైవేట్, ఇతర వాహనాల్లో జిల్లా నలుమూలల నుంచి డ్వాక్రా మహిళలను తరలించారు. కడప మార్కెట్ యార్డ్‌కు జిల్లా నలుమూలల నుంచి అక్కడకు తీసుకుని వచ్చి వదిలిపెట్టారు. బస్సులన్నీ మార్కెట్ యార్డ్‌లో పార్కింగ్ చేశారు. కడప రీజనల్ పరిధిలో వివిధ డిపోలనుంచి 28 ఆర్టీసీ బస్సులను నడిపారు. ఈ బస్సులలో కేవలం డ్వాక్రా మహిళలను తరలించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలను తీసుకుని వచ్చిన తర్వాత రొటేషన్ పద్ధతిలో ఆర్టీసీ సంస్థకు సదరు బస్సుల అద్దెలను ప్రభుత్వం నుంచి వస్తాయి. అప్పటికపుడు ఛార్జీల ప్రకారం ఇవ్వక పోవడం గమనార్హం. కడప మార్కెట్ యార్డు వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ షౌకత్ అలీ, డీటీసీ ఎస్‌ఐ ఆర్.రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.