జోగిపేట: వెనకబడిన కుమ్మరులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఒక్కో కు టుంబానికి ఐదెకరాల వ్యవసాయ భూమిని కేటాయించాలని జిల్లా కుమ్మరుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ఆది వారం అందోలు గెస్ట్‌హౌస్ వద్ద జరిగిన కుమ్మరుల సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి పాపయ్య అధ్యక్షత వహించారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీసీ బీ గ్రూపు నుంచి బీసీ ఏ గ్రూపులో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కుమ్మరుల అభివృద్ధికి వంద కోట్లు కేటాయించాలంటూ పలు డిమాండ్లు చేశారు.
గ్రామకమిటీల ఏర్పాటు
అందోలు మండల కుమ్మరి సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పాపయ్య, ప్రధానకార్యదర్శిగా రాములు, కోశాధికారిగా యాద య్య, ఉపాధ్యక్షుడిగా నర్సింలు, రవీం దర్, సహాయ కార్యదర్శులు, కిష్టయ్య, శివకుమార్, రాములు, ప్రచార కార్యదర్శిగా యాదయ్య, గాలయ్య, సలహాదారులుగా సుధాకర్, రాములు, చంద్రశేఖర్, అంజనేయులు, గౌరవ అధ్యక్షుడిగా బాలయ్యను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు,నాయకులు ఈశ్వర్‌తో పాటు అందోలు, హత్నూర, పుల్కల్, వట్‌పల్లి మండలాల కుమ్మరులు పాల్గొన్నారు.
ఒక్కో కుటుంబానికి ఐదెకరాలు కేటాయించాలి
Published Mon, Jan 9 2017 4:04 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Advertisement