Laxminarayan
-
ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకు వైఎస్ జగన్ అభినందనలు
-
అక్కరకు రాని అమ్మ త్యాగం
⇔కుమారుడికి దానం చేసిన కిడ్నీ ఫెయిల్ ⇔రెండోసారి లైవ్‌డోనర్స్ లేక ఆదుకోని ఆరోగ్యశ్రీ ⇔బిడ్డ కోసం శ్రీకాకుళం నుంచి వలస ⇔దిక్కుతోచని స్థితిలో కుటుంబం చేతికి అందివచ్చిన కుమారుడికి భరించరాని కష్టం వచ్చింది. కిడ్నీలు దెబ్బతిని మంచం పట్టడంతో తల్లి కడుపు తరుక్కుపోయింది. కొడుకు జీవితమే ముఖ్యమని భావించి ఆమె తన కిడ్నీని అర్పించింది. అయినా కాలం కలిసిరాలేదు. ఆ కిడ్నీ కూడా దెబ్బతింది. ఇప్పుడు బిడ్డను బతికించుకోవడానికి రూ.8లక్షలు అవసరం. చేతిలో చిల్లిగవ్వలేక.. కుటుంబ పోషణ కష్టమై పొట్ట చేత పట్టుకుని ఆ కుటుంబం శ్రీకాకుళం జిల్లా నుంచి పట్నానికి వలస వచ్చింది. కుమారుడిని బతికించుకోవడం కోసం దాతల సాయాన్ని అర్ధిస్తోంది. గోపాలపట్నం(విశాఖ పశ్చిమ) : శ్రీకాకుళం జిల్లా జి.శిగడం మండలం నర్సింహపురం గ్రామానికి చెందిన అల్లు లక్ష్మీనారాయణ(25) ఐటీఐ చదివి వెల్డరుగా పనిచేసేవాడు. 2009లో ఉన్నట్టుండి మంచానపడ్డాడు. కిడ్నీలు దెబ్బతిన్నట్టు వైద్యులు స్పష్టం చేశారు. అప్పట్లో ఇతనికి తల్లి సింహాద్రమ్మ తన కిడ్నీ ఇచ్చి ఆదుకుంది. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందింది. లక్ష్మీనారాయణ కోలుకుని సాధారణ స్థితికి వచ్చాడనుకుంటే 2016లో తల్లి ఇచ్చిన కిడ్నీ కూడా దెబ్బతింది. దీంతో కొద్ది నెలలుగా డయాలసిస్ చేస్తూ కుమారుడిని బతికించుకుంటున్నారు. బతికించుకోవడానికి వలస లక్ష్మీనారాయణ కుటుంబ నేపథ్యం పేదరికం. తల్లిదండ్రులతో పాటు ఓ తమ్ముడు ఉన్నారు. గతంలో తండ్రి రమణకు ఈయన చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఇప్పుడా పరిస్థితి లేదు. భారం అంతా తండ్రిపైనే పడుతోం ది. ఈ రోజు కూలి దొరికితే ఇంకో రోజు దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి. విశాఖకు వస్తే కూలి చేసి కనీసం దగ్గర్లో ఆస్పత్రికి వెళ్లి కుమారుడికి డయాలసిస్ చేయించుకోవచ్చ ని భావించి కుటుంబంతో వలస వచ్చేశారు. ప్రస్తు తం గోపాలపట్నం శివారు కొత్తపాలెంలో నివాసం ఉంటున్నారు. రమణ కూలి చేసి తెస్తున్న సంపాదన తినడానికే సరిపోతోంది. లక్ష్మీనారాయణకు డయాలసిస్ చేయించడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరో వైపు అప్పులూ పుట్టక డయాలసిస్ చేయించడానికి తండ్రి కొట్టుమిట్టాడుతున్నాడు. ‘జీవన్‌దాన్’ పొందడానికి పేదరికం అడ్డు మరణానంతరం తమ అవయవాలు మరికొందరికి ఉపయోగపడాలని వేల మంది జీవన్‌దాన్ పథకానికి అవయవదానాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ లక్ష్మీనారాయణకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఆర్థిక పరిస్థితులు అడ్డంకిగా మారాయి. ఈ పథకం కింద లబ్ధిపొందడానికి లక్ష్మీనారాయణ తన పేరును 2017 జనవరి 31న నమోదు చేసుకున్నాడు. అయితే కేజీహెచ్‌లో ఈ పథకం లేదు. కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే ఉంది. మరో వైపు ఆరోగ్యశ్రీ కూడా దీనికి వర్తించదు. ఇంట్లో రక్త సంబంధీకులు నేరుగా అవయదానం చేస్తేనే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. జీవన్‌దాన్ ద్వారా కిడ్నీ పొందాలంటే రూ.8 లక్షల ఖర్చు తప్పదని కేర్ ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. దీంతో ఇంత మొత్తం ఎక్కడ్నుంచి తెచ్చేదని లక్ష్మీనారాయణ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కుమారుడి పరిస్థితి చూసి వారు కంటతడి పెడుతున్నారు. దాతల సాయం కోసం అర్ధిస్తున్నారు. అల్లు లక్ష్మీనారాయణ, డోర్: 20–192/1, అప్పలనరసింహం కాలనీ, కొత్తపాలెం, గోపాలపట్నం, విశాఖ–27 చిరునామాలో గాని, ఫోన్ నంబర్లు 90004 52749/94909 42362లలో సంప్రదించవచ్చు. -
ఒక్కో కుటుంబానికి ఐదెకరాలు కేటాయించాలి
జోగిపేట: వెనకబడిన కుమ్మరులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఒక్కో కు టుంబానికి ఐదెకరాల వ్యవసాయ భూమిని కేటాయించాలని జిల్లా కుమ్మరుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ఆది వారం అందోలు గెస్ట్‌హౌస్ వద్ద జరిగిన కుమ్మరుల సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి పాపయ్య అధ్యక్షత వహించారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీసీ బీ గ్రూపు నుంచి బీసీ ఏ గ్రూపులో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కుమ్మరుల అభివృద్ధికి వంద కోట్లు కేటాయించాలంటూ పలు డిమాండ్లు చేశారు. గ్రామకమిటీల ఏర్పాటు అందోలు మండల కుమ్మరి సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పాపయ్య, ప్రధానకార్యదర్శిగా రాములు, కోశాధికారిగా యాద య్య, ఉపాధ్యక్షుడిగా నర్సింలు, రవీం దర్, సహాయ కార్యదర్శులు, కిష్టయ్య, శివకుమార్, రాములు, ప్రచార కార్యదర్శిగా యాదయ్య, గాలయ్య, సలహాదారులుగా సుధాకర్, రాములు, చంద్రశేఖర్, అంజనేయులు, గౌరవ అధ్యక్షుడిగా బాలయ్యను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు,నాయకులు ఈశ్వర్‌తో పాటు అందోలు, హత్నూర, పుల్కల్, వట్పల్లి మండలాల కుమ్మరులు పాల్గొన్నారు. -
టీపీయూఎస్ దీక్షను జయప్రదం చేయ్యండి
- రాష్ట్రకార్యదర్శి లక్ష్మినారాయణ్ హిమాయత్‌నగర్(హైదరాబాద్‌సిటీ) సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(టిపియూఎస్) ఆధ్వర్యంలో బుధవారం తలపెట్టిన ఛలో హైదరాబాద్, సామూహిక నిరాహార దీక్షను ఉపాధ్యాయులంతా ఏకమై జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.జె.లక్ష్మినారాయణ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ బుధవారం ఇందిరాపార్క్ వద్ద ఉదయం 10గంటలకు ఈ ఆందోళనను నిర్వహిస్తున్నామన్నారు. సీపీఎస్ విధానం రద్దు పరచి పాత పెన్షన్ విధానంను వర్తింపచేయాలన్నారు. ఉపాధ్యాయుల నుంచి కొంత ప్రీమియం తీసుకుని, ప్రభుత్వ ఆరోగ్యకార్డులతో అన్ని ఆసుపత్రులలో వైద్యచికిత్సలు, ఓపి సౌకర్యాన్ని కల్పించాలన్నారు. 10వ, పీఆర్సీ బకాయిలను వెంటనే నగదు రూపంలో చెల్లించాలని, అన్ని పాఠశాలలకు స్వీపర్, అటెండర్ పోస్టులను మంజూరు చేయాలని తదితర డిమాండ్ల సాధనకై తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు జయప్రదం చేయాలని విజ్ఞిప్తి చేశారు. -
తల్లిదండ్రుల చేతుల్లో పిల్లల భవిష్యత్
విజయనగరం లీగల్: పిల్లల భవిష్యత్ తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులదేనని జిల్లా జడ్జి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్మన్ ఎం.లక్ష్మీనారాయణ హితవు పలికారు. స్థానిక న్యాయసేవాసదన్‌లో బాలల హక్కులు, బాల నేరస్తులతో పోలీసులు ప్రవర్తించాల్సిన తీరుపై ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు ఈ చట్టంపై అవగాహన నిర్వహిస్తున్నామన్నారు. పరిసర ప్రాంతాలు, సినిమాలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, ఈ కారణంగానే కొంతమంది బాలలు నేర ప్రవృత్తికి అలవాటు పడుతున్నారన్నారు. వీరిపై కేసులు నమోదు అయినప్పుడు పోలీసులు సున్నితంగా వ్యవహరించాలని హితవు పలికారు. వారిని శిక్షించడం కన్నా వారిలో మార్పు తీసుకురావడం కోసమే కృషి చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. పక్కాగా చట్టాల అమలు ఎస్పీ ఎల్.కె.వి.రంగారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు బాలల హక్కుల సంరక్షణకు చట్టాలు రూపొందించాయని, వాటిని పక్కాగా అమలు చేయడానికి జువైనల్ అధికారులు, పోలీస్ అధికారులు బాల న్యాయాధికారులు, శిశు సంరక్షణ అధికారులు కృషి చేయాలని కోరారు. సమాజంలో పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. బాల నేరస్తుల కేసులు విచారణ చేసేటప్పుడు పోలీసు అధికారులు యూనిఫాం ధరించకూడదన్నారు. బాలల విషయంలో మీడియాకు కూడా ఆంక్షలు ఉన్నాయన్నారు. వీరి ఫొటోలు, పేర్లు ప్రచురించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. దీనిపై కూడా మీడియా ప్రతినిధులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ అధికారి, జువైనల్ వెల్ఫేర్ ఎం. శరత్ బాబు బాలల న్యాయ రక్షణ సంరక్షణ చట్టం, 2015 అమలు, అధికారులు నిర్వహించాల్సిన విధులు, బాల న్యాయ చట్టాల రూల్స్‌పై అవగాహన కల్పించారు. అలాగే పిల్లల మనస్తత్వం, కౌన్సెలింగ్‌పై సైకాలిజిస్ట్ డాక్టర్ ఎన్.సూర్యనారాయణ, బాల నేరాలపై సెంట్రల్ క్రైం స్టేషన్ డీఎస్పీ ఎస్.చక్రవరి, బాలల న్యాయ హక్కులు జాతీయ విధానంపై లీగల్ సర్వీసెస్ మెంబర్ బి.ఎల్.నరసింగరావు, బాల నేరాల కేసులు, పరిష్కారంపై అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె.ఆశారాణి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్టు జడ్జి, అదనపు జడ్జి బి.శ్రీనివాసరావు, స్పెషల్ జడ్జి, ఎస్సీ, ఎస్టీ చట్టం, అదనపు జడ్జి వి.వెంకటేశ్వరరావు, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీహరి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐ.సురేష్, జిల్లాలోని 42మంది ఎస్ఐలు, చిన్న పిల్లల సంరక్షణ సంక్షేమాధికారులు, జువైనల్ అధికారులు, జిల్లా ప్రొహిబిషన్ అధికారులు, పోలీస్ అధికారులు, పిల్లల సంరక్షణ ఎన్జీవో సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రూ.15కే కమ్మని భోజనం
కడుపునిండా కమ్మని భోజనం చేయాలంటే కనీసం 70 రూపాయలైనా పెట్టక తప్పదు. కానీ రూ.15కే కరీంనగర్ జిల్లా గోదావరిఖని బస్టాండ్ సమీపంలోని శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక అందిస్తోంది. ఈ కార్యక్రమాన్ని గోదావరిఖని కార్పొరేషన్ మేయర్ లక్ష్మీనారాయణ, ట్రాఫిక్ సీఐలు వెంకటేశ్వర్లు, విజయ్‌కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సంస్థ అనాథ వృద్ధుల ఆశ్రమాన్ని నిర్వహిస్తోంది. అన్నదాన కార్యక్రమం ద్వారా వచ్చే కొద్ది ఆదాయాన్ని అందుకు వినియోగిస్తామని ప్రకటించింది. -
ఖాకీల దెబ్బలకు వ్యక్తి కన్నుమూత
మడకశిర: కొద్ది రోజుల్లో జరగనున్న తన కుమార్తె పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న ఓ వ్యక్తి పోలీసు దెబ్బలకు బలై ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ దారుణ సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. మడకశిర పట్టణానికి చెందిన లక్ష్మీనారాయణ (50) అలియాస్ అప్పి పెద్ద కుమార్తె చంద్రకళ వివాహం ఈ నెల 25న ఉంది. పెళ్లి పత్రికలు పంచేందుకు అతను మడకశిర మండలంలోని పలు గ్రామాలకు ఆదివారం వెళ్లాడు. తిరుగు పయనంలో పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని గౌడేటి వద్ద కొందరు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి తీసుకువస్తున్న పోలీసులకు అప్పి తారసపడ్డాడు. అతడినీ జూదగాడని ఆరోపిస్తూ అమరాపురానికి చెందిన కానిస్టేబుళ్లు నాగరాజు, నరసింహమూర్తి దాడిచేసి రాళ్లతో కొట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు.. జోక్యంచేసుకొని అప్పిని ఆదివారం రాత్రి ఇంటికి పంపారు. దెబ్బలతో ఇంటికి వచ్చిన బాధితుడు.. సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. కుటుంబీకులు మడకశిర ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆగ్రహించిన మృతుడి బంధువులు, అప్పి మృతదేహంతో పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్న తదితరులు పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకుని ఎస్పీతో ఫోన్లో మాట్లాడి బాధిత కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని కోరారు. దీంతో అప్పి మృతికి కారకులైన కానిస్టేబుళ్లపై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని పెనుకొండ డీఎస్పీ ప్రకటించడంతో బాధితులు ఆందోళన విరమించారు. -
టికెట్ లేని ప్రయాణికులకు రూ.16.67 లక్షల జరిమానా
సికింద్రాబాద్ స్టేషన్లో తనిఖీల్లో పట్టుబడ్డ 3 వేలమంది సాక్షి, హైదరాబాద్: టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిపై రైల్వే అధికారులు కొరడా ఝలిపించారు. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ లక్ష్మినారాయణ్, సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ రవి పి.పాడి ఆధ్వర్యంలో 145 మంది సిబ్బంది మంగళవారం ఏకకాలంలో సికింద్రాబాద్ స్టేషన్లో తనిఖీలు జరిపారు. మొత్తం 34 ఎక్స్‌ప్రెస్, 6 ప్యాసింజర్, 36 ఎంఎంటీఎస్ రైళ్లలో తనిఖీలు జరిపి 3,090 మందిని పట్టుకున్నారు. ఇందులో 1,005 మంది టికెట్ లేకుండా ప్రయాణిస్తుండగా.. 1,851 మంది టికెట్‌తో సంబంధంలేని తరగతుల్లో ప్రయాణిస్తున్నారు. 234 మంది బుకింగ్ చేయకుండా సరుకు తరలిస్తూ పట్టుబడ్డారు. వీరందరిపై కేసులు నమోదు చేసిన అధికారులు, రూ.16.67 లక్షల జరిమానా విధించారు. స్టేషన్ పరిసరాలను అపరిశుభ్రంగా మారుస్తున్నందుకు 66 మందికి పెనాల్టీ విధించటం విశేషం. కాకినాడ నుంచి ప్రత్యేక రైలు.. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కాకినాడ-సికింద్రాబాద్ మధ్య 25న ప్రత్యేక రైలు నడుపుతున్నారు. ఆ రోజు సాయంత్రం 6.50కి కాకినాడలో బయలుదేరే ప్రత్యేక రైలు (నంబర్ 07012) మరుసటి రోజు ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
స్వాతంత్య్ర యోధుడు లక్ష్మీనారాయణ కన్నుమూత
హైదరాబాద్ : మహరాజ్ గంజ్ మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్య్ర సమరయోధుడు ఎన్.లక్ష్మీనారాయణ ముదిరాజ్(86) బుధవారం కన్నుమూశారు. అనారోగ్యంతో ఉన్న ఆయన హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఉదయం గోడేకికబర్ నయీ బస్తీలోని ఆయన నివాసానికి లక్ష్మీనారాయణ పార్థివ దేహాన్ని తీసుకురావడంతో నగరంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖులు, స్థానికులు తరలివచ్చి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ తొలిదశ ఉద్యమ కాలంలో లక్ష్మీనారాయణ ముదిరాజ్ (1969-70) నగర మేయర్‌గా పనిచేశారు. ఆయన హయాంలోనే గన్‌పార్కులోని అమరవీరుల స్తూపాన్ని నిర్మించడంతో అప్పటి ప్రభుత్వం ఆయనను జైలుకు పంపింది.అనంతరం 1972 నుంచి 1978 వరకు మహరాజ్ గంజ్ ఎమ్మెల్యేగా (ప్రస్తుతం గోషామహల్), బీసీ కమిషన్ సభ్యునిగా, ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ అధ్యక్షునిగా, ఏపీ టింబర్ మర్చెట్స్ సంఘ అధ్యక్షునిగా ఆయన పనిచేశారు. ఎగ్జిబిషన్ సొసైటీకి సీనియర్ సభ్యుడైన లక్ష్మీనారాయణ ముదిరాజ్‌ను ఈ ఏడాది జనవరి 1వ తేదీన సీఎం కేసీఆర్ ఘనంగా సత్కరించారు. లక్ష్మీనారాయణకు ఇద్దరు కుమారులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో సీఎం ఆదేశాలతో లక్ష్మీనారాయణ అంత్యక్రియలను బుధవారం సాయంత్రం పురానాపూల్ శ్మశాన వాటికలో ప్రభుత్వ లాంఛనాలతో చేపట్టారు. ఈ ఏర్పాట్లను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వ్యక్తిగతంగా పర్యవేక్షించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, హైదరాబాద్ ఆర్డీవో నిఖిల, మాజీ మంత్రి, సీఎల్పీ నేత ఎమ్మెల్యే కె.జానారెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ, ఎగ్జిబిషన్ సొసైటీ గౌరవ కార్యదర్శి నరోత్తమరెడ్డి, ఎకనామిక్ కమిటీ కార్యదర్శి వనం వీరేందర్, మాజీ కార్యదర్శి ఆర్.సుఖేష్‌రెడ్డి, కోశాధికారి అనిల్‌స్వరూప్ మిశ్రా, ఇతర ప్రతినిధులు నివాళులర్పించారు.అంతిమ యాత్రలో భాగంగా గన్పార్క్వద్దకు తెచ్చిన లక్ష్మీనారాయణ పార్థివ దేహానికి ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, తూళ్ల ఉమా, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ నివాళులర్పించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగం జనార్థనరెడ్డి, స్థానిక బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లతోపాటు పలు పార్టీల నేతలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సీఎం సంతాపం లక్ష్మీనారాయణ ముదిరాజ్ మరణం పట్ల సీఎం కె.చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. నగర మేయర్‌గా, ఎమ్మెల్యేగా సేవలు అందించిన ఆయన తెలంగాణ ఉద్యమానికి ఊతంగా నిలిచారని కొనియాడారు. అసెంబ్లీ ఎదుట అమరవీరుల స్తూపం నిర్మించే విషయంలో ఎంతో చొరవ, ధైర్యం ప్రదర్శించారని అభిప్రాయపడ్డారు. గన్‌పార్కుకు లక్ష్మీనారాయణ పేరు పెట్టాలి దివంగత లక్ష్మీనారాయణ పేరును గన్‌పార్కుకు పెట్టాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ బుధవారం లేఖను రాసింది.ఆయన మృతికి టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, శాసనమండలిలో ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు షబ్బీర్ అలీ, నాగయ్య, కుమార్‌రావు, లక్ష్మణ్‌గౌడ్, దామోదర్, కిసాన్‌సెల్ అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, అధికారప్రతినిధి కృష్ణమోహన్‌రావు తదితరులు లక్ష్మీనారాయణ బౌతికకాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. -
ధనలక్ష్మి కేసులో నిందితులు అరెస్టు
బంటుమిల్లి : బంటుమిల్లికి చెందిన యామర్తి లక్ష్మీనారాయణ రెండో కుమార్తె వై.ధనల క్ష్మి మృతి కేసులో కుటుంబసభ్యులతో పాటు పలువురిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 22వ తేదీ రాత్రి ధనలక్ష్మి అనుమానాస్పదంగా మృతి చెందింది. 23వ తేదీ తెల్లవారుజామున కుటుంబసభ్యులు పలువురి సహకారంతో దహనం చేశారు. దీనిపై 26వ తేదీన పోలీసులు కేసు నమోదు చేశారు. వారం రోజుల పాటు దర్యాప్తు జరిపి ధనలక్ష్మి తండ్రి యామర్తి లక్ష్మీనారాయణ, అన్న సత్యన్నారాయణలతోపాటు మృతురాలి ప్రియుడు మద్దాల చిరంజీవి, ఆటో డ్రైవరు ఆకునూరు వీర వెంకటేశ్వరరావు, శ్మశానానికి వె ళ్లిన పోసిన మోహన్‌రావు, మద్దిపూడి కోటేశ్వరరావు, పొదిలి వెంకటేశ్వరరావును అరెస్టు చేసి విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బందరు రూరల్ సీఐ ఎస్.వి.మూర్తి మాట్లాడుతూ చదువుకునే సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో వారిద్దరి మధ్య సంబంధం ఏర్పడిందన్నారు. ఈ విషయం తెలిసిన చిరంజీవి పెద్దలు 2004లో మరో యువతితో వివాహం జరిపించారని తెలిపారు. ఆ తర్వాత కూడా ధనలక్ష్మి, చిరంజీవి వ్యవహారంపై గ్రామ పెద్దలు రాజీ చర్చలు జరిపినట్లు చెప్పారు. ధనలక్ష్మికి 2012లో గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహం జరిపారన్నారు. ధనలక్ష్మికి వివాహం అయిన తర్వాత కూడా చిరంజీవి వేధింపులకు గురి చేసినట్లు తెలిపారు. దీంతో ధనలక్ష్మి కుటుంబంలో మనస్పర్థలు వచ్చాయని, ఈ విషయం విడాకుల వరకు వచ్చిందని చెప్పారు. చిరంజీవి వేధింపులు తాళలేక ధనలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. ఈ మేరకు మొదటి ముద్దాయిగా చిరంజీవిపై ఐపిసి 306 చట్టం నమోదు చేశామన్నారు. మిగిలిన వారిపైన 201 కేసు పెట్టినట్లు తెలిపారు. అనంతరం నిందితులను బంటుమిల్లి జూనియర్ ఫస్ట్ క్లాస్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఎస్ఐ చిర ంజీవి సిబ్బంది పాల్గొన్నారు. పోలీసుల దర్యాప్తుపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.