కడుపునిండా కమ్మని భోజనం చేయాలంటే కనీసం 70 రూపాయలైనా పెట్టక తప్పదు. కానీ రూ.15కే కరీంనగర్ జిల్లా గోదావరిఖని బస్టాండ్ సమీపంలోని శ్రీధర్మశాస్త్ర నిత్యాన్నదాన వేదిక అందిస్తోంది. ఈ కార్యక్రమాన్ని గోదావరిఖని కార్పొరేషన్ మేయర్ లక్ష్మీనారాయణ, ట్రాఫిక్ సీఐలు వెంకటేశ్వర్లు, విజయ్‌కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సంస్థ అనాథ వృద్ధుల ఆశ్రమాన్ని నిర్వహిస్తోంది. అన్నదాన కార్యక్రమం ద్వారా వచ్చే కొద్ది ఆదాయాన్ని అందుకు వినియోగిస్తామని ప్రకటించింది.
రూ.15కే కమ్మని భోజనం
Published Tue, Mar 15 2016 3:01 PM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM
Advertisement
Advertisement