- - ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి
- - వేలేరులో జోనల్ స్థాయి క్రీడాపోటీలు ప్రారంభం
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
Published Sat, Sep 17 2016 12:35 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
వేలేరు (ధర్మసాగర్ ) : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని శాసన మండలి విప్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని వేలేరు హైస్కూల్‌లో 62వ పాఠశాల క్రీడా సమాఖ్య జోనల్ క్రీడోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒలిపింక్స్‌లో దేశానికి పతకాన్ని సాధించిపెట్టిన సింధూను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు.
జిల్లాలు, మండలాల ఏర్పాటు అనంతరం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించనున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని స్థానిక నాయకులు, ఘనంగా సన్మానించారు. టీఎన్‌జీఓఎస్ అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డి, ఎంపీపీ వల్లపురెడ్డి లక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు కీర్తి వెంకటేశ్వర్లు, సర్పంచ్ విజపూరి మల్లికార్జున్, ఎంపీటీసీ సభ్యులు కత్తి సంపత్, బిల్లా యాదగిరి, హెచ్‌ఎం.రాజిరెడ్డి, ఎస్‌ఎంసీ చైర్మన్ గుండు బిక్షపతి, పీఈటీలు వాసుదేవరావు, గ్రేసమ్మ తదితరులు పాల్గొన్నారు.
సోడాషపల్లి గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్సీ....
అనంతరం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వగ్రామం సోడాషపల్లిలో జరిగిన సమావేశానికి హాజరై గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా విప్‌గా ఎంపికైన సందర్భంగా గ్రామస్తులు ఆయనను సన్మానించారు. జెడ్పీటీసీ సభ్యుడు కీర్తి వెంకటేశ్వర్లు, సర్పంచ్ గడ్డి సాయిలు, ఎంపీటీసీ సభ్యురాలు కాల్వ శోభరాణి తదితరులు పాల్గొన్నారు.
Advertisement