విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ రమేష్‌బాబు, అతిధులు
వ్యవసాయరంగం అభివృద్ధికి కృషి చేయాలి
Published Fri, Dec 2 2016 10:52 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
– రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రూ. 13కోట్లతో ఆర్‌ఏఆర్‌ఎస్‌లో ఎలక్ట్రానిక్ సెల్
– ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వ విద్యాలయం డీన్ ఆఫ్ ఆగ్రికల్చర్ రమేష్‌బాబు
మహానంది: వ్యవసాయరంగాన్ని ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రతి విద్యార్థి కృషి చేయాలని, అందుకు అవసరమైన పరిశోధనలు చేయాలని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ రమేష్‌బాబు పిలుపునిచ్చారు. మహానంది సమీపంలోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ కళాశాల రజతోత్సవ వేడుకల ప్రారంభోత్సవానికి అతిథిగా హాజరైన ఆయన స్థానిక కాన్ఫరెన్స్ హాల్‌లో విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయరంగ విద్యార్థులు నూతన వంగడాలను, ఆధునిక పద్ధతులను సృష్టిస్తూ అభివృద్ది బాటలో నడవాలన్నారు. నీటి ఎద్దడి ప్రాంతాల్లో రైతుల కష్టాలను తీర్చడం, తేమను, నేలలను బట్టి వ్యవసాయాభివృద్ధి చేసేలా నూతన విధానాలను కనుగొనాలన్నారు.
రూ. 13కోట్లతో ఆర్‌ఏఆర్‌ఎస్‌లో ఎలక్ట్రానిక్ సెల్:
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నంద్యాల పట్టణంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం(ఆర్‌ఏఆర్‌ఎస్)లో రూ. 13కోట్లతో ఎలక్ట్రానిక్ సెల్‌ను నిర్మించనున్నట్లు డాక్టర్ రమేష్‌బాబు తెలిపారు. ఈ ఎలక్ట్రానిక్ సెల్ ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని షార్ట్‌ఫిల్మ్స్, భవిష్యత్ ప్రణాళికలు తయారు చేసుకోవచ్చన్నారు. మహానంది వ్యవసాయ కళాశాలలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రూ. 9లక్షలతో ఎకోస్టూడియో నిర్మించారన్నారు. రూ. 13లక్షలతో కాన్ఫరెన్స్‌హాల్ తయారు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో విశ్వ విద్యాలయం లైబ్రేరియన్ డాక్టర్ శారదా జయలక్ష్మి, డీన్ ఆఫ్ పీజీ స్టడీస్ డాక్టర్ వీరరాఘవయ్య, ఫ్రొఫెసర్ ఆఫ్ అకడమిక్ డాక్టర్ టి.శ్రీనివాస్, మహానంది వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ డి.బాలగురవయ్య, మహానంది కళాశాల ఫ్రొఫెసర్లు డాక్టర్ కేఎన్ రవికుమార్, డాక్టర్ కేఎన్ శ్రీనివాసులు, డాక్టర్ ఎంఎస్ రాహుల్, డాక్టర్ సరోజినీదేవి, శైలజారాణి, డాక్టర్ విజయభాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
నేడు రైతు సదస్సు
మహానంది వ్యవసాయ కళాశాలలో శనివారం రైతు సదస్సు నిర్వహించనున్నారు. సుమారు 1000 మంది రైతులు హాజరుకానున్నారు. సుమారు 30 మంది శాస్త్రవేత్తలతో వారిరి వివిధ రకాలపంటలపై సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు కళాశాల సిబ్బంది తెలిపారు.
Advertisement