ఇక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ ప్రారంభం
- రూరల్ టెక్నాలజీ పాలసీకి ముఖ్యమైంది
- రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్
కరీంనగర్ హెల్త్ : నగరంలోని పాపారావు కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఇక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కరీంనగర్ శాఖను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు బుధవారం ప్రారంభించారు. కేటీఆర్ మాట్లాడుతూ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కే పరిమితంకాకుండా గ్రామాలకు విస్తరింపజేయాలనే సీఎం కేసీఆర్ ఆలోచనను ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. ప్రస్తుతం 200మందితో ప్రారంభిస్తున్నారని త్వరలోనే వెయ్యి మందికి ఉపాధి కల్పించనుందన్నారు. కరీంనగర్ చుట్టుపక్కల 16 ఇంజినీరింగ్ కళాశాలలు ఉండడంతోనే ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడ సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఏర్పడే నష్టాలను పూడ్చేందుకు ప్రభుత్వం సహకారమందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు కషి చేస్తామన్నారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్‌లో నాలుగు ఐటీ కంపెనీలు స్థాపించినట్లు తెలిపారు. హైదరాబాద్ తర్వాత కరీంనగర్‌కు తగిన ప్రా«ధాన్యత కల్పించడం అభివద్ధికి నాంది అన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఐటీ కంపెనీని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎంపీలు బోయిన్‌పల్లి వినోద్‌కుమార్, బాల్క సుమన్, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎనర్జీ అండ్ ఇండస్ట్రీ ప్రిన్సిపాల్ సెక్రెటరీ అరవింద్‌కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌రాజన్, కలెక్టర్ నీతూప్రసాద్, మున్సిపల్ కమిషనర్ కష్ణభాస్కర్, ఎమ్మెల్యే బొడిగే శోభ, మేయర్ రవీందర్‌సింగ్, ఇక్లాట్ డైరెక్టర్లు పొలసాని కార్తీక్, స్నేహ పాల్గొన్నారు.