health solutions
-
‘ఎక్లాట్’లో 1,400 ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య, రక్షణ రంగంలో సాంకేతిక, సేవల రంగంలో పేరొందిన వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ (ఎక్లాట్) తెలంగాణలో తన గ్లోబల్ డెలివరీ సెంటర్ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్‌లో వచ్చే 18 నెలల కాలంలో మరో 1,400 మంది ఉద్యోగులను నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న ఎక్లాట్ ఇప్పటికే కరీంనగర్లో నిర్వహిస్తున్న కార్యకలాపాలను విస్తరించడంతో పాటు వరంగల్, ఖమ్మంలో రెండు కొత్త డెలివరీ సెంటర్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ సెంటర్లో 300 మంది చొప్పున, హైదరాబాద్‌లో 500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించింది. ఎక్లాట్ ప్రతినిధులు గురువారం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఎక్లాట్కు అవసరమైన సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. హెల్త్‌కేర్ సొల్యూషన్స్ కోసం తాము తెలంగాణ ఏఐ మిషన్‌తోనూ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఎక్లాట్ సీఈఓ కార్తీక్ పోల్సాని, సీఓఓ స్నేహా పోల్సాని తెలిపారు. ఇదిలా ఉంటే 2016లో తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఇప్పటికే కరీంనగర్లో 200 మెడికల్ కోడిం గ్, టెక్నాలజీ ఉద్యోగాలను ఎక్లాట్ సృష్టించింది. Thanks to Eclat Health Solutions for providing their continuous support to Telangana Govt in our endeavour to promote IT in tier-2 cities. @taskts and @AiTelangana will collaborate with Eclat for skill development and innovation in Healthcare NLP and AI — KTR (@KTRTRS) February 3, 2022 -
ఆస్టియోపొరాసిస్ అంటే..
మా అక్కయ్యను హాస్పిటల్ చెకప్‌కు తీసుకెళ్తే ‘ఆస్టియో పొరాసిస్’ అని చెప్పారు. దీని గురించి వినడం ఇదే మొదటిసారి. వివరంగా తెలియజేయగలరు. ఈ సమస్య ఎందుకు వస్తుంది? నివారణ మార్గాలు ఎలా ఉంటాయి? – పి. శ్యామల, హైదరాబాద్ మనిషి ఎముకలు క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలతో పాటు కొలాజెన్ అనే కణజాలంతో కలసి గట్టిగా ఉండటం జరుగుతుంది. వీటి లోపల ఎల్లప్పుడూ పాత కణాలతో పాటు కొత్త కణాలు తయారవుతూ ఉంటాయి. ఈ ఖనిజాలతో ఎముకలు గట్టిగా దృఢంగా ఉంటాయి. ఎముకల లోపలి గుజ్జు అరిగిపోయి, ఎముకలు పెళుసుగా బలహీనంగా తయారై, ఎముకలు అరిగిపోవడానికి ‘ఆస్టియోపొరాసిస్’ అంటారు. దీనివల్ల మనిషి కొద్దిగా పడినా, జారినా ఎముకలు విరిగి ఫ్రాక్చర్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. ఆస్టియో పొరాసిస్ సాధారణంగా వయసు పైబడే కొద్దీ, అంటే 45 ఏళ్ల వయసు దాటిన తర్వాత మగవారిలో కంటే ఆడవారిలో ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఆస్టియో పొరాసిస్ బలహీనంగా ఉన్నవారిలో, జన్యు కారణాల వల్ల, తొందరగా మెనోపాజ్ దశకు చేరేవారిలో, క్యాల్షియం, విటమిన్–డి లోపం ఉన్నవారిలో, స్టిరాయిడ్స్ వంటి మందులు దీర్ఘకాలం వాడే వారిలో ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా లేనివారిలో, స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అలవాట్లు ఉన్నవారిలో ఎక్కువగా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఆస్టియో పొరాసిస్ ఉన్నవారిలో ఎముకలలో కణజాలం అరిగిపోవడం ఉంటుంది కాని కొత్త కణజాలం తయారు కావడం తక్కువగా ఉంటుంది. ఆడవారిలో మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ తగ్గిపోవడంతో ఎముకలలోకి క్యాల్షియం చేరడం తగ్గిపోతుంది. దీనివల్ల నడుంనొప్పి, వెన్నెముక అరిగి ఎత్తు తగ్గడం, ఒంగిపోయినట్లు అవ్వడం, తరచు ఫ్రాక్చర్లు కావడం వంటి సమస్యలు ఉంటాయి. లక్షణాలు కనిపించేటప్పటికే ఎముకలు బాగా బలహీనపడి ఉంటాయి. ఆస్టియో పొరాసిస్ కంటే ముందు ఆస్టియో పినియా దశ ఉంటుంది. ఇది ఎముకలలో గుజ్జు తగ్గడం మొదలయ్యే దశ. ఈ సమస్యను బీఎండీ, డెక్సా వంటి పరీక్షల ద్వారా నిర్ధారణ చేయడం జరుగుతుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే మార్పులను మార్చడం కష్టం గాని, ఆహారంలో క్యాల్షియం ఎక్కువగా ఉండే పాల పదార్థాలు, ఆకూకూరలు, మాంసాహారం వంటివి తీసుకోవడం, వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు చేయడం, ఎండలో వారానికి మూడుసార్లు కనీసం పావుగంట సేపు ఉండటం వల్ల విటమిన్–డి తయారవుతుంది. ఇది క్యాల్షియంను ఎముకలలోకి చేరుస్తుంది. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం, డాక్టర్ సలహా మేరకు విటమిన్–డి, క్యాల్షియం మాత్రలు వంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆస్టియో పొరాసిస్ త్వరగా రాకుండా నివారించవచ్చు. ఒకసారి ఆస్టియో పొరాసిస్ నిర్ధారణ అయిన తర్వాత పైన జాగ్రత్తలతో పాటు డాక్టర్ పర్యవేక్షణలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, బైఫాస్ఫొనేట్స్, రెలాక్సోఫిన్, పారాథైరాయిడ్ హార్మోన్ వంటి మందులను క్రమం తప్పకుండా తీసుకోవలసి ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో Urinary Tract Infection (UTI) సాధారణం అని చెబుతుంటారు. దీనికి కారణం ఏమిటి? ఎలాంటి నివారణ చర్యలు ఉన్నాయి? – కమల, కరీంనగర్ ప్రెగ్నెన్సీ సమయంలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మామూలు వారిలో కంటే కొద్దిగా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మూత్రాశయం వెనుకకు ఆనుకొనే గర్భాశయం ఉంటుంది. బిడ్డ పెరిగే కొద్దీ గర్భాశయం పెరుగుతూ మూత్రాశయం పైన బరువు పడటం, ఒత్తిడి పడటం వల్ల మూత్రం పూర్తిగా మూత్రాశయం నుంచి బయటకు రాలేకపోవచ్చు. అందువల్ల మూత్రం కొద్దిగా మూత్రాశయంలో నిల్వ ఉండిపోయే అవకాశాలు పెరుగుతాయి. దానివల్ల మూత్రాశయంలో ఇన్ఫెక్షన్కు కారణమయ్యే బ్యాక్టీరియా పెరిగి, వ్యాప్తి చెంది మూత్రాశయం నుంచి యురెటర్స్కు, తద్వారా కిడ్నీలకు ఇన్ఫెక్షన్ పాకే అవకాశం ఉంటుంది. గర్భిణీ స్త్రీలు రోజుకు రెండున్నర నుంచి మూడు లీటర్ల మంచినీళ్లను తాగాలి. మూత్రం వస్తుంటే ఆపుకోకుండా మూత్ర విసర్జన చేస్తుండాలి. మలవిసర్జన తర్వాత ముందు నుంచి వెనుకకు శుభ్రం చేసుకోవాలి. మల, మూత్ర విసర్జన తర్వాత యోనిభాగం దగ్గర చెమ్మ లేకుండా శుభ్రంగా పొడిగా ఉంచుకోవాలి. మితమైన పౌష్టికాహారం తీసుకోవాలి. దానివల్ల రక్తహీనత లేకుండా, రోగనిరోధకశక్తి తగ్గకుండా ఉంటుంది. కాబట్టి ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందకుండా ఉంటాయి. గర్భంతో ఉన్నప్పుడు కంప్లీట్ యూరినరీ ఎగ్జామినేషన్ చేయించుకొని, అందులో ఇన్ఫెక్షన్స్ ఉంటే యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్ట్ చేయించుకొని దానికి తగ్గ యాంటీ బయోటిక్స్ కోర్సు వాడాల్సి ఉంటుంది. - డా. వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదరాబాద్ -
ఇక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ ప్రారంభం
రూరల్ టెక్నాలజీ పాలసీకి ముఖ్యమైంది రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్ హెల్త్ : నగరంలోని పాపారావు కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఇక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కరీంనగర్ శాఖను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు బుధవారం ప్రారంభించారు. కేటీఆర్ మాట్లాడుతూ ఐటీ కంపెనీలు హైదరాబాద్‌కే పరిమితంకాకుండా గ్రామాలకు విస్తరింపజేయాలనే సీఎం కేసీఆర్ ఆలోచనను ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. ప్రస్తుతం 200మందితో ప్రారంభిస్తున్నారని త్వరలోనే వెయ్యి మందికి ఉపాధి కల్పించనుందన్నారు. కరీంనగర్ చుట్టుపక్కల 16 ఇంజినీరింగ్ కళాశాలలు ఉండడంతోనే ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడ సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఏర్పడే నష్టాలను పూడ్చేందుకు ప్రభుత్వం సహకారమందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు కషి చేస్తామన్నారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్‌లో నాలుగు ఐటీ కంపెనీలు స్థాపించినట్లు తెలిపారు. హైదరాబాద్ తర్వాత కరీంనగర్‌కు తగిన ప్రా«ధాన్యత కల్పించడం అభివద్ధికి నాంది అన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే ఐటీ కంపెనీని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎంపీలు బోయిన్పల్లి వినోద్‌కుమార్, బాల్క సుమన్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎనర్జీ అండ్ ఇండస్ట్రీ ప్రిన్సిపాల్ సెక్రెటరీ అరవింద్‌కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్రాజన్, కలెక్టర్ నీతూప్రసాద్, మున్సిపల్ కమిషనర్ కష్ణభాస్కర్, ఎమ్మెల్యే బొడిగే శోభ, మేయర్ రవీందర్‌సింగ్, ఇక్లాట్ డైరెక్టర్లు పొలసాని కార్తీక్, స్నేహ పాల్గొన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీ హుజూరాబాద్‌కు వరం – రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు హుజూరాబాద్ : సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేయడం హుజూరాబాద్‌కు వరమని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు అన్నారు. ఈ అవకాశాలను గ్రామీణ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐటీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సెక్రటరీ జయేష్‌రంజన్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్, ఆర్డీవో చంద్రశేఖర్, నగరపంచాయతీ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్, టెలేఖా కంపెనీ సీఈవో రోహిత్ చంద్ర పాల్గొన్నారు.